దేశంలో కరోనావైరస్ వీరవిహారం చేస్తోంది. లాక్ డౌన్ నుంచి ప్రభుత్వాల సడలింపుల నేపథ్యంలో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా 11502 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 332424కు చేరుకుంది. ఇందులో యాక్టీవ్ కేసుల సంఖ్య 153106గా ఉంది. కాగా కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారు 169798 మంది ఉన్నారు. ఇక దేశంలో దేశంలో మొత్తం 9520 మంది కరోనా కారణంగా చనిపోయారు. ప్రస్తుతం వ్యాధి నుంచి రికవరీ రేటు 51.1శాతంగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. కాగా ప్రజంట్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.