దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24 వేల 850 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మరో 613 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పెరుగుతోన్నమరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజు పరిధిలో ఈ స్థాయిలో మరణాలు, కేసులు నమోదవడం ఇదే ఫస్ట్ టైమ్.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కరోనా గురించి వెల్లడించింన తాజా వివరాలు :
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,73,165
ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 2,44,814
వ్యాధి నుంచి కోలుకున్నవారు 4,09,082
కరోనాతో మరణించినవారి సంఖ్య 19,268
ఇక మహారాష్ట్రలో కోవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,00,064చేరింది. వీరిలో 8,671 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1,07,001మందికి వైరస్ నిర్దారణ కాగా.. ప్రాణాలు కొల్పోయినవారి సంఖ్య 1,450కి చేరింది. గుజరాత్లో 1,925 మందిని వైరస్ బలితీసుకుంది. దిల్లీలో మొత్తం పాజిటివ్ కేసులు 9,72,002కు, మృతుల సంఖ్య 3,004కి చేరింది.