దేశంలో 54 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

దేశంలో క‌రోనా వికృతరూపం కొన‌సాగుతూనే ఉంది. నిత్యం లక్షకు చేరువగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 93 వేలు కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

దేశంలో 54 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

Updated on: Sep 20, 2020 | 11:41 AM

దేశంలో క‌రోనా వికృతరూపం కొన‌సాగుతూనే ఉంది. నిత్యం లక్షకు చేరువగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 93 వేలు కొత్త కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 54 ల‌క్ష‌లు దాటాయి.

దేశ‌వ్యాప్తంగా ఇవాళ కొత్త‌గా 92,605 మంది క‌రోనా వైరస్ బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 54,00,620 చేరుకుంది. కాగా, ఇవాళ కరోనాను జయించలేక 1,133 మంది మృత్యువాతపడ్డారు. దీంతో క‌రోనా బారినపడి మృతుల సంఖ్య 86,752కు చేరాయని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ ప్ర‌క‌టించింది. అయితే, మొత్తంలో కేసుల్లో 10,10,824 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, కొవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన 43,03,044 మంది కోలుకున్నారు. శనివారం ఒక్క‌రోజే 12,06,806 మందికి క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి ప్ర‌క‌టించింది. దీంతో సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు 6,36,61,060 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్లడించింది.