దేశ వ్యాప్తంగా 99,773 మంది కరోనాతో మృతి

|

Oct 02, 2020 | 11:54 AM

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 81,484 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,095 మంది కరోనా బలితీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా 99,773 మంది కరోనాతో మృతి
Follow us on

India Coronavirus Cases : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 81,484 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,095 మంది కరోనా బలితీసుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు శుక్రవారం హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,609గా నమోదయ్యింది.

ఇక దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,42,217గా ఉండగా..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 53,52,078కి చేరింది. కోవిడ్‌ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 99,773కు చేరింది. గడచిన 24 గంటలలో 10,97,747 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 7,67,17,728 ఉంది. అయితే కొన్ని మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభన కొనసాగుతూనే ఉంది. అక్కడి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న అడ్డుకట్ట వేయలేక పోతున్నారు.