Ind Vs Sl: జడ్డూ అజేయ సెంచరీ.. అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ.. మొహాలి టెస్టులో పట్టు బిగించిన భారత్‌..

Ind Vs Sl 1st Test, Day2: రవీంద్ర జడేజా అజేయ సెంచరీ ( 175 నాటౌట్‌: 17 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (61 పరుగులు, 21/2) ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది.

Ind Vs Sl: జడ్డూ అజేయ సెంచరీ.. అశ్విన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభ.. మొహాలి టెస్టులో పట్టు బిగించిన భారత్‌..
Ind Vs Sl
Follow us

|

Updated on: Mar 05, 2022 | 6:35 PM

Ind Vs Sl 1st Test, Day2: రవీంద్ర జడేజా అజేయ సెంచరీ ( 175 నాటౌట్‌: 17 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (61 పరుగులు, 21/2) ఆల్‌రౌండ్‌ ప్రతిభతో మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగించింది. శనివారం జడ్డూ రికార్డ్‌ సెంచరీతో టీమిండియా 574/8 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకేయులను టీమిండియా బౌలర్లు దెబ్బతీశారు. వరుస విరామాల్లో వికెట్లు తీశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో నిశాంక (26), అసలంక (1) ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ 2.. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు. భారత జట్టు కంటే లంక ఇంకా 466 పరుగులు వెనకబడి ఉంది.

జడేజా కీలక భాగస్వామ్యాలు.. ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు రవీంద్ర జడేజా, అశ్విన్ సెంచరీ భాగస్వామ్యం (130) నిర్మించారు. ఈ క్రమంలో జడేజా సెంచరీ, అశ్విన్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అశ్విన్‌ మరింత దూకుడుగా ఆడే యత్నంలో అక్మల్‌ షార్ట్‌పిచ్‌ బంతికి కీపర్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత జయంత్‌ యాదవ్‌ (2) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే షమీ (20 నాటౌట్‌) సహాయంతో జడేజా తన దూకుడును కొనసాగించారు. వీరిద్దరూ కలిసి వంద పరుగుల (103) భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా ఏడో స్థానంలో దిగి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. రెండో సెషన్‌ టీ బ్రేక్ సమయానికి కెప్టెన్‌ రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంకకు ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నె (28), లహిరు తిరిమన్నె (17) శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరి వెంటవెంటనే పెవిలియన్‌కు పంపించారు అశ్విన్‌, జడేజా. మరోవైపు నిశాంకతో కలిసి సీనియర్‌ బ్యాటర్‌ ఏంజెలో మాథ్యూస్ (22) ఆచి తూచి ఆడాడు. అయితే బుమ్రా వేసిన ఓ అద్భుతమైన బంతికి మాథ్యూస్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. సమీక్షకు వెళ్లినా మాథ్యూస్‌ నిరాశ ఎదురైంది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన డిసిల్వా (1)ను అశ్విన్‌ ఎల్బీగా ఔట్‌ చేశాడు. కాగా రెండో రోజూ టీమిండియా తీసిన నాలుగు వికెట్లూ ఎల్బీలే కావడం గమనార్హం.

Also Read:LIC Policy: ప్రతి నెల రూ.51,000 పెన్షన్.. ఉన్నన్ని రోజులు భర్తకి.. ఆ తర్వాత భార్యకి పెన్షన్..!

Salmon Fish: సాల్మన్ చేపలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.. లెక్కకు మించిన ప్రయోజనాలు

BECIL Jobs: డిగ్రీ అర్హతతో..బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో