పాక్ రాజధానిలో మొద‌టి హిందూ ఆలయం..

భార‌త ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయం ఏర్పాటు రంగం సిద్ద‌మైంది.

పాక్ రాజధానిలో మొద‌టి హిందూ ఆలయం..

Updated on: Jun 24, 2020 | 11:01 PM

భార‌త ప్ర‌జ‌ల‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయం ఏర్పాటు రంగం సిద్ద‌మైంది. భారీ ఖ‌ర్చుతో మువ్వ‌ల గోపాలుడు శ్రీకృష్ణుడి ఆలయ ఏర్పాటుకు అక్క‌డి ప్ర‌జలు ముంద‌డుగు వేశారు. జూన్ 23 ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన‌ పనులను లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఆలయ నిర్మాణం కోసం దాయాది పాకిస్థాన్ గ‌వ‌ర్న‌మెంట్ రూ.10 కోట్లు కేటాయించింది. 20,000 చదరపు అడుగుల్లో శ్రీకృష్ణ ఆల‌యం నిర్మితం కానుంది. ఈ ఆలయానికి ద‌గ్గ‌ర్లోనే హిందువుల కోసం స్పెష‌ల్ శ్మశాన వాటికను నిర్మించనున్నారు.

హ్యూమ‌న్ రైట్స్ పార్లమెంటరీ కార్యదర్శి లాల్ చంద్ మల్హి ఈ ఆలయ పనులను స్టార్ట్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా విష‌యాలు వెల్లడించారు. ఇస్లామాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లో 1947కి పూర్వం చాలా హిందూ టెంపుల్స్ ఉండేవని లాల్ చంద్ మల్హి పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం అవేవీ లేవని..గత 20 సంవ‌త్స‌రాలుగా రాజధానిలో హిందువుల జనాభా అధికంగా పెరిగిందని ఆయన వివ‌రించారు. వారంతా ప్రేయ‌ర్స్ కోసం సుదూర ప్రాంతాల‌కు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలోనే ఆలయాలయాలను నిర్మించడానికి సన్నాహాలు చేసిన‌ట్టు లాల్ చంద్ మల్హి పేర్కొన్నారు.ఈ దేవస్థానానికి ఇస్లామాబాద్‌లోని హిందూ పంచాయతీ ‘శ్రీకృష్ణ మందిర్‌’ అని పేరు పెట్టింది‌.