ఈవీఎంలే కాదు.. విమానాలూ మొరాయిస్తున్నాయి

| Edited By:

Apr 29, 2019 | 11:38 AM

ఎయిరిండియా ప్యాసింజర్ విమానాలు కూడా మొరాయిస్తున్నాయి. ఈ ఎన్నికల సీజన్‌లో అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయిస్తుంటే.. అదే ‘అస్వస్థత’ వీటికి కూడా పట్టినట్లు కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో ఎయిరిండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ దాదాపు ఐదు గంటలపాటు మొరాయించి, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయగా.. సోమవారం ఏకంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్ సిస్టమ్‌ సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ తెల్లవారుజామున ఇమిగ్రేషన్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. గంటల పాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. […]

ఈవీఎంలే కాదు.. విమానాలూ మొరాయిస్తున్నాయి
Follow us on

ఎయిరిండియా ప్యాసింజర్ విమానాలు కూడా మొరాయిస్తున్నాయి. ఈ ఎన్నికల సీజన్‌లో అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయిస్తుంటే.. అదే ‘అస్వస్థత’ వీటికి కూడా పట్టినట్లు కనిపిస్తోంది. శని, ఆదివారాల్లో ఎయిరిండియా పాసింజర్ సర్వీస్ సిస్టమ్ దాదాపు ఐదు గంటలపాటు మొరాయించి, ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయగా.. సోమవారం ఏకంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్ సిస్టమ్‌ సర్వర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ తెల్లవారుజామున ఇమిగ్రేషన్ సర్వర్ డౌన్ అవ్వడంతో.. గంటల పాటు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఇక ఈ సమస్యపై ఎయిర్‌పోర్టులో బహిరంగ ప్రకటన చేసిన అధికారులు.. మాన్యువల్ చెకింగ్ విధానంలో ప్రయాణికులను విమానాలు ఎక్కించారు.

కాగా మరోవైపు ఇమిగ్రేషన్ ఆలస్యం అవుతుండటంపై పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో పొడవాటి క్యూలైన్లను ఫొటో తీసి సామాజిక మాధ్యమంలో పెడుతూ.. ఎయిర్‌పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇండియాలోనే అత్యంత రద్దీగా ఉంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై వారు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే సర్వర్ డౌన్ వలన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.