కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ

| Edited By:

Apr 21, 2020 | 3:02 PM

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కాగా.. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు

కరోనా ఎఫెక్ట్: దాడులకు నిరసనగా.. 23న బ్లాక్ డే: ఐఎంఏ
Follow us on

కోవిద్-19 ధాటికి ప్రపంచ దేశాలన్ని చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ భారత్ లోనూ విజృంభిస్తోంది. కాగా.. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్‌డే పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై జరుగుతున్నా దాడులకు నిరసనగా.. ఆ రోజు దేశంలోని డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని  డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

[svt-event date=”21/04/2020,2:45PM” class=”svt-cd-green” ]