AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..

అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. పండంటి కాపురాల్ని దెబ్బ తీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్త, భార్య వేరే వ్యక్తులతో పెట్టుకున్న వివాహేతర సంబంధాలు... హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం..
Balaraju Goud
|

Updated on: Aug 10, 2020 | 9:59 AM

Share

అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. పండంటి కాపురాల్ని దెబ్బ తీస్తున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్త, భార్య వేరే వ్యక్తులతో పెట్టుకున్న వివాహేతర సంబంధాలు… హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మహానగరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేరే వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం ఆమె ప్రాణం తీసింది.

ఉప్పల్ పీఎస్ పరిధి చిలకానగర్‌లో రేణుక అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అదే ప్రాంతానికి చెందిన అంజయ్య, రేణుకల మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంజయ్య భార్య పుట్టింటికి వెళ్లగా.. నిన్న రాత్రి చిలకానగర్‌లోని అంజయ్య నివాసానికి రేణుక వచ్చింది. ఈ నేపథ్యంలో రేణుకను అంజయ్య దారుణంగా హత్య చేశాడు. రేణుక తలపై బలమైన గాయాలున్నాయి. హత్యానంతరం అంజయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ హత్యకి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Follow Us
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి జీతభత్సాలు పెరిగే ఛాన్స్..
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?