చిలకమ్మా.. నీ డ్యాన్స్ భలే జోరమ్మా..

ముద్దుముద్దుగా మాటలు పలికే చిలకలను చూస్తుంటాం. తమ జోలికి వస్తే ముక్కుతోనే తాటతీసే చిలకలను చూస్తుంటాం. అయితే డ్యాన్స్ వేసే చిలుకను ఎప్పుడైనా చూశారా..? తాజాగా తన డ్యాన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది ఓ చిలుక. రష్యన్ ఫోక్ పాటకు ఆ చిలుక వేసిన స్టెప్‌లు ఇప్పుడు నెటిజన్లను భలే ఆకట్టుకుంటున్నాయి. చిలకమ్మా.. నువ్వు భలే డ్యాన్స్ చేస్తున్నావమ్మా అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంటరాక్షన్‌లో భాగంగా మనుషులు డ్యాన్స్ వేస్తుంటారు. అలాగే చిలుకలు కూడా […]

చిలకమ్మా.. నీ డ్యాన్స్ భలే జోరమ్మా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2019 | 2:36 PM

ముద్దుముద్దుగా మాటలు పలికే చిలకలను చూస్తుంటాం. తమ జోలికి వస్తే ముక్కుతోనే తాటతీసే చిలకలను చూస్తుంటాం. అయితే డ్యాన్స్ వేసే చిలుకను ఎప్పుడైనా చూశారా..? తాజాగా తన డ్యాన్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది ఓ చిలుక. రష్యన్ ఫోక్ పాటకు ఆ చిలుక వేసిన స్టెప్‌లు ఇప్పుడు నెటిజన్లను భలే ఆకట్టుకుంటున్నాయి. చిలకమ్మా.. నువ్వు భలే డ్యాన్స్ చేస్తున్నావమ్మా అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇంటరాక్షన్‌లో భాగంగా మనుషులు డ్యాన్స్ వేస్తుంటారు. అలాగే చిలుకలు కూడా మనతో ఇంటరాక్షన్ అయ్యేందుకు డ్యాన్స్ వేస్తాయని శాన్ డైగో‌లోని న్యూరోసైనెన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో పనిచేసే డాక్టర్ అనిరుధ్ పటేల్ ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఆయన అభిప్రాయాన్ని బలపరుస్తూ పలువురు తమ చిలుకలు డ్యాన్స్ వేసే వీడియోలను షేర్ చేసినప్పటికీ.. ఇప్పుడు ఈ చిలుక వేసిన ఈ వీడియో అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.