Muskmelon And Milk: పాలతో కర్బూజా జ్యూస్ చేస్తే ఇక అంతే సంగతులు.. ఆ సమస్యతో ముప్పే

ర్బూజా వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పాలతో కర్బూజా కలిపి తీసుకుంటే అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బయట ఎక్కడైనా మనం కర్బూజా జ్యూస్ తాగితే కచ్చితంగా కర్బూజాతో పాటు పాలతో కలిపి చేసి ఇస్తారు.

Muskmelon And Milk: పాలతో కర్బూజా జ్యూస్ చేస్తే ఇక అంతే సంగతులు.. ఆ సమస్యతో ముప్పే
Muskmelon (7)

Updated on: Apr 12, 2023 | 4:30 PM

భారతదేశంలో వేసవికాలం ప్రారంభమైంది.  గత 10 రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా క్రమేపి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు శరీరానికి మేలు చేసే వివిధ జావలు, జ్యూస్‌లు సేవించడంపై దృష్టి పెడతారు. వేసవిలో ముఖ్యంగా కర్బూజా సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే కర్బూజా వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా పాలతో కర్బూజా కలిపి తీసుకుంటే అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బయట ఎక్కడైనా మనం కర్బూజా జ్యూస్ తాగితే కచ్చితంగా కర్బూజాతో పాటు పాలతో కలిపి చేసి ఇస్తారు. అయితే ప్రతి ఆహారం దాని సొంత రుచిని కలిగి ఉంటుంది. అలాగే జీర్ణక్రియ తర్వాత ప్రభావాలను కలిగి ఉంటుంది. విభిన్నమైన అభిరుచులను కలిగి ఉండే రెండు ఆహారపదార్థాలు కలిపితే, అది కడుపులోని జీర్ణక్రియ విషయాల్లో అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. పేలవమైన ఆహార కలయికలు కూడా అజీర్ణంతో పాటు శరీరంలో గ్యాస్ సమస్య ఏర్పడటానికి కారణమవుతాయి.  సాధారణంగా పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. అయితే కర్బూజా మాత్రం త్వరగా జీర్ణం అయ్యిపోతుంది. కాబట్టి వాటిని కలపడం వల్ల జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. అలాగే మీకు రోజంతా అసౌకర్యంగా లేదా అలసటగా కూడా అనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్బూజా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఓ సారి తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు దూరం

కర్బూజాలో ఫైబర్‌తో పాటు వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కర్బూజాలోని ఫైబర్ కంటెంట్ సరైన పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కడుపుపై ​​ప్రశాంతత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఫైబర్ ఆహార కోరికలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

మెరుగైన రోగనిరోధక శక్తి

కర్బూజాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్‌గా వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఫైటోకెమికల్స్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి పేగు పనితీరును సాఫీగా ఉంచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన పేగు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడంలో సాయం

కర్బూజాల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గించే లక్ష్యాలను నిర్దేశించుకునేటప్పుడు మనం మంచి ఆహార పదార్థాల కోసం వెతుకుతున్నాం. పోషకాలు అధికంగా ఉండే ఈ పండులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ నీటి అవసరాలను తీర్చడంలో సహాయపడవచ్చు. అలాగే బరువు తగ్గడానికి కూడా మీకు సహాయం చేస్తుంది.

పీరియడ్స్ సమస్యలు దూరం

పీరియడ్స్ సమయంలో నొప్పి అనేది చాలా మంది మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే ఇలాంటి సమయంలో మందులు వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మహిళలు కర్బూజా తినడం వల్ల ఇది గడ్డలను కరిగించడంతో కండరాల తిమ్మిరిని తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రుతు ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని వివరిస్తున్నారు. 

మరిన్ని లైఫ్‌స్టైల్  వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..