మరికాసేపట్లో ఐపీఎల్‌పై నిర్ణయం..

|

Jul 20, 2020 | 4:16 PM

ఐసీసీ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. దీనితోపాటు ఐసీసీ...

మరికాసేపట్లో ఐపీఎల్‌పై నిర్ణయం..
Follow us on

ICC Board Meeting Today : నేడు ఐసీసీ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు. దీనితోపాటు ఐసీసీ అధ్యక్షుడి ఎన్నికపై ఓ నిర్ణయం కూడా వెలువడనుంది.

ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ – నవంబర్‌ మధ్య జరుగాల్సిన టీ20 ప్రపంచకప్‌ భవితవ్యంపై తీవ్ర సందిగ్ధతలో పడింది. కొవిడ్ వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మెగాటోర్నీపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తుది నిర్ణయం కోసం అన్ని క్రికెట్‌ బోర్డులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నాయి.

అయితే.. ఇదే విషయంపై ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మరోసారి ఐసీసీ (ICC) బోర్డు సమావేశం జరగనుంది. కరోనా తీవ్రత కొనసాగుతుండడం, ఆతిథ్యానికి క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం విముఖంగా ఉండడంతో ఈ ఏడాది ప్రపంచకప్‌ వాయిదా వేసేందుకే ఐసీసీ మొగ్గు చూపే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

బీసీసీఐ కూడా ఐసీసీ నుంచి ఇలాంటి ప్రకటననే కోరుకుంటున్నది. టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్ (IPL)‌ 13వ సీజన్‌ను నిర్వహించాలని బీసీసీఐ అనుకుంటోంది. ఈ ఏడాది టోర్నీని యూఏఈలో జరుపాలని ప్లాన్ చేస్తున్నారు.