చైనా వైమానిక స్థావరాలపై ఐఏఎఫ్ ‘ నిఘా’

టిబెట్, జిన్ జియాంగ్ ప్రాంతాల్లోని చైనా వైమానిక స్థావరాలను భారత వైమానిక దళం నిశితంగా గమనిస్తోంది. అక్కడి చైనా ఫైటర్లు, బాంబర్లు, డ్రోన్ల 'ఉనికిని  ట్రాక్ చేస్తోంది. సరిహద్దుల్లో  ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో వాటిపై నిరంతర నిఘా..

చైనా వైమానిక స్థావరాలపై ఐఏఎఫ్ ' నిఘా'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 28, 2020 | 3:51 PM

టిబెట్, జిన్ జియాంగ్ ప్రాంతాల్లోని చైనా వైమానిక స్థావరాలను భారత వైమానిక దళం నిశితంగా గమనిస్తోంది. అక్కడి చైనా ఫైటర్లు, బాంబర్లు, డ్రోన్ల ‘ఉనికిని  ట్రాక్ చేస్తోంది. సరిహద్దుల్లో  ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో వాటిపై నిరంతర నిఘా అవసరమని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ నియంత్రణ రేఖ పొడవునా మన వైమానిక శక్తితో పోలిస్తే ఆ దేశ వైమానిక పోరాట పటిమ పెద్దగా లేదని, ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జిన్ జియాంగ్ లో హాటన్, కష్గర్ , గార్గున్ సా, లాసాల లోని డ్రాగన్ కంట్రీ ఎయిర్ బేస్ ల నుంచి ముప్పు లేదని ఇవి వివరించాయి. అటు-నియంత్రణ రేఖ పొడవునా 3,488 కి.మీ. పొడవునా భారత వైమానిక దళం వివిధ స్థాయిల్లో మిసైళ్లను మోహరించింది. సుఖోయ్, మిగ్-29, జాగ్వార్ ఫైటర్స్ వంటివాటిని ఇదివరకే ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లలో ప్రవేశపెట్టారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ విమానాలతో పోలిస్తే వాటి కన్నా మన వైమానిక దళమే అత్యంత వేగంగా మరిన్ని ఫైటర్లను తరలించగలదని, పైగా ఎత్తయిన కొండల పై నుంచి ఇండియా వైపున్న స్థావరాలపైకి  ఆ దేశం దాడులు చేయజాలదని ఉన్నత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.ఆర్మీ చీఫ్ ఎం.ఎం.నరవాణే ఇటీవలే నియంత్రణ రేఖ పొడవునా భారత సైనిక, వైమానిక దళ స్థావరాల వద్ద పరిస్థితిని పరిశిలించారు.