ఇంటికి వెళ్లను.. శ్రీనగర్‌కు వెళతా: అభినందన్

| Edited By:

Mar 27, 2019 | 6:39 AM

ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించారు. పాక్ నుంచి మార్చి 1న భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఓ నాలుగు వారాల పాటు సెలవులపై ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. అయితే తమిళనాడులో ఉన్న తన ఇంటికి వెళ్లనని అభినందన్ స్పష్టం చేశారట. కావాలంటే జమ్ముకశ్మీర్‌లోని వాయుసేన క్యాంపులో యుద్ధ విమానాలు, సహోద్యోగులతో ఉంటానని […]

ఇంటికి వెళ్లను.. శ్రీనగర్‌కు వెళతా: అభినందన్
Follow us on

ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ సెలవుపై ఇంటికి వెళ్లేందుకు నిరాకరించారు. పాక్ నుంచి మార్చి 1న భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన విచారణ పూర్తయ్యాక ఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఓ నాలుగు వారాల పాటు సెలవులపై ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. అయితే తమిళనాడులో ఉన్న తన ఇంటికి వెళ్లనని అభినందన్ స్పష్టం చేశారట. కావాలంటే జమ్ముకశ్మీర్‌లోని వాయుసేన క్యాంపులో యుద్ధ విమానాలు, సహోద్యోగులతో ఉంటానని ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నాలుగు వారాలు పూర్తయ్యాక ఆయన మళ్లీ వైద్య పరీక్షలకు ఢిల్లీ రావాల్సి ఉంది. యుద్ధ విమానాలను నడిపేందుకు అభినందన్ ఆరోగ్యం పూర్తిగా సహకరిస్తుందని వైద్యులు ధృవీకరించాకే ఆయన మళ్లీ విమానాలను నడపగలరు.

కాగా పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో పాక్ విమానాన్ని పేల్చేసే క్రమంలో అభినందన్ పాక్‌ భూభాగంలో చిక్కుకున్నారు. ఆ తరువాత భారత్ ఒత్తిడి మేరకు అభినందన్‌ను సురక్షితంగా పాక్ అధికారులు మన దేశానికి అప్పగించిన విషయం తెలిసిందే.