హోం మంత్రి అమిత్ షా ఇటీవల బెంగాల్ లోని బీర్ భమ్ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ వసుదేవ్ దాస్ అనే జానపద గాయకుడి ఇంట్లో లంచ్ చేశారు. అయితే ఆ సందర్భంగా తాను ఆయనతో మాట్లాడలేకపోయానని దాస్ విచారం వ్యక్తం చేశారు. తన పాట ఆయన వినడం పట్ల సంతోషంగా ఉన్నానని, కానీ మాలాంటి పేద జానపద కళాకారుల పట్ల ఎవరైనా ఏ చర్యలు తీనుకుంటున్నారని ఆయన ఆవేదన ప్రకటించారు. మా దుస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్దామనుకున్నా కానీ అవకాశం లభించలేదు అని దాస్ చెప్పారు. ఆర్థికంగా తామెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అమిత్ షా వెళ్ళిపోయాక ఏ బేజేపీ నాయకుడూ తనను పలకరించలేదని దాస్ వాపోయారు. కాగా దీనిపై ఒక విధంగా బీజేపీ వ్యాఖ్యానిస్తూ ఇప్పటికైనా పాలక తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ఇలాటి వారిని ఆదుకోవాలని కోరింది.
అయితే బీర్ భమ్ జిల్లా టీ ఎం సీ అధ్యక్షుడు అనుబ్రత మండల్ దీనిపై స్పందిస్తూ..ప్రభుత్వం నుంచి దాస్ కుటుంబానికి సాయం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు.