తెలంగాణ మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్

తెలంగాణ‌లో మందుబాబులు.. బార్లు లేదా క్ల‌బ్బుల‌కు వెళ్లి మ‌ద్యం సేవించాలంటే మ‌రికొంత‌కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం జీవో కూడా విడుద‌ల చేసింది.

తెలంగాణ మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్

Updated on: Sep 04, 2020 | 12:37 PM

తెలంగాణ‌లో మందుబాబులు.. బార్లు లేదా క్ల‌బ్బుల‌కు వెళ్లి మ‌ద్యం సేవించాలంటే మ‌రికొంత‌కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్ర‌భుత్వం జీవో కూడా విడుద‌ల చేసింది. తాజాగా కేంద్రం విడుద‌ల చేసిన‌ అన్‌లాక్ గైడ్‌లైన్స్ అనుగుణంగా ఢిల్లీ, హర్యానా క‌ర్ణాట‌క రాష్ట్రాలు బార్లు, రెస్టారెంట్ల‌లో లిక్క‌ర్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు అనుమ‌తులు ఇచ్చేశాయి. అయితే అన్‌లాక్‌ 4.0 కోసం కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలను విడుదల చేసిన వెంటనే, తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఓ జీవో రిలీజ్ చేసింది. అందులో బార్లు, క్లబ్బులు ఇంకా కొంత‌కాలం మూసివేసే ఉంటాయి. వాటి ప్రారంభానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయబడతాయి అని వెల్ల‌డించింది.

“కొన్ని రాష్ట్రాలు బార్లు, రెస్టారెంట్లులో మ‌ద్యం సేవించేందుకు అనుమతించాయ‌ని మాకు తెలుసు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేసి ఇక్కడ కూడా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తాం. భౌతిక దూరం అనేది ఇక్కడ ప్ర‌ధాన స‌మ‌స్య‌. అది స‌రిగ్గా పాటించ‌క‌పోతే వ్యాధి వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంది. దీనిపై సీఎంతో చ‌ర్చించి నాలుగు, ఐదు రోజుల్లో ఓ నిర్ణయం తీసుకుంటాం” అని ఎక్సైజ్ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

 

Also Read :

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​