
అసలే కరోనా ప్రభావం.. పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకుంటేనే వైరస్ ని తట్టుకునే శక్తి అంతంత మాత్రం. ఇక ఇలాంటి సమయంలో పాచిన బిర్యానీ పెడితే ఎలావుంటుంది. అదే పని చేసింది కుషాయిగూడలోని బిర్యానీ జోన్ రెస్టారంట్. జోమాటో ద్వారా చికెన్ బిర్యానీ అర్డర్ చేసిన వ్యక్తికి పాచిన బిర్యానీని సఫ్లై చేసింది.
లాక్ డౌన్ సడలింపులతో హైదరాబాద్ లోని ఒక్కో రెస్టారెంట్ ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే, హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన కస్టమర్ కి బిర్యానీపై మోజుపడింది. దీంతో జోమాటో ద్వారా చికెన్ బిర్యానీకి అర్డర్ ఇచ్చాడు. కుషాయిగూడకు చెందిన బిర్యానీ జోన్ రెస్టారెంట్ నుంచి డెలివరీ బాయ్ తీసుకొచ్చిన.. బిర్యానీ పార్శిల్ విప్పిన కస్టమర్ కి అందులో దుర్వాసన రావడంతో రెస్టారెంట్ కు ఫోన్ చేయగా తాము అందరికి ఒకే విధంగా సరఫరా చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ.. పాచిపోయిన బిర్యానీ సఫ్లై చేస్తున్న రెస్టారెంట్లపై చర్య తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నాడు.