హైదరబాద్‌లో మతమౌఢ్యం.. అన్యమతస్థుడు ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాడంటూ..

| Edited By:

Oct 27, 2019 | 6:22 AM

అన్యమతస్థుడు ఫుడ్ డెలివరీ చేశాడంటూ ఇంటికి వచ్చిన అర్డర్‌ను రిజెక్ట్ చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఓ ఆర్డర్ బుక్ చేశాడు. అయితే ఆ ఆర్డర్‌ను అందజేసేందుకు.. ముదాసిర్ అనే కంపెనీ తరఫు వ్యక్తి .. అజయ్ కుమార్ అడ్రస్‌కు వచ్చాడు. అయితే ఆ డెలివరీ బాయ్ అన్యమతానికి చెందిన వాడు కావడంతో.. సదరు ఫుడ్ ఆర్డర్‌ను తిరస్కరించాడు. దీంతో ఆ డెలివరీ […]

హైదరబాద్‌లో మతమౌఢ్యం.. అన్యమతస్థుడు ఫుడ్ డెలివరీ తీసుకొచ్చాడంటూ..
Follow us on

అన్యమతస్థుడు ఫుడ్ డెలివరీ చేశాడంటూ ఇంటికి వచ్చిన అర్డర్‌ను రిజెక్ట్ చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఓ ఆర్డర్ బుక్ చేశాడు. అయితే ఆ ఆర్డర్‌ను అందజేసేందుకు.. ముదాసిర్ అనే కంపెనీ తరఫు వ్యక్తి .. అజయ్ కుమార్ అడ్రస్‌కు వచ్చాడు. అయితే ఆ డెలివరీ బాయ్ అన్యమతానికి చెందిన వాడు కావడంతో.. సదరు ఫుడ్ ఆర్డర్‌ను తిరస్కరించాడు. దీంతో ఆ డెలివరీ బాయ్  సదరు కస్టమర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను పనిచేస్తున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో అజయ్ కుమార్ అనే వ్యక్తి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడని.. డెలివరీ చేసేందుకు అతని ఇంటి వద్దకు వెళ్లగా తన మతం వేరే అన్న కారణంతో.. దాన్ని తీసుకునేందుకు తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ముదాసిర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, ఇటీవల ఇలాంటి ఘటనే ఒకటి జోమాటో సంస్థలో చోటుచేసుకుంది. శ్రావణమాసంలో అన్యమతస్థుడితో అర్డర్ పంపిస్తారా అంటూ.. ఇలానే ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. జోమాటటోకి ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. అయితే అప్పుడు ఇది పెద్ద వివాదంగా మారింది. ఫుడ్‌కి మతం లేదంటూ.. జోమాటో రీ ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియా జోమాటో ట్వీట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఫుడ్‌కి మతం లేదని సందేశాలిచ్చే జొమాటో.. హలాల్ ఐటెమ్స్‌ని ఎందుకు విక్రయిస్తోందంటూ నెటిజెన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తాజాగా మళ్లీ ఇలాంటి తరహా వివాదమే.. ఇప్పుడు భాగ్యనగరంలో తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.