మళ్లీ తెరుచుకున్న గొల్కొండ కోట

|

Sep 03, 2020 | 12:57 PM

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.. ఈ కారణంగానే హైదరాబాద్ ప్రసిద్ధ గొల్కొండ కోట సందర్శనకు పర్యాటకుల అనుమతిని నిషేధించారు. గోల్కొండ కోట మళ్లీ తెరుచుకుంది.

మళ్లీ తెరుచుకున్న గొల్కొండ కోట
Follow us on

పాడు కరోనా… మనిషికి మనిషిక మధ్య దూరాన్నిపెంచేసింది.. పెంచేయడమేమిటి ..? అసలు అనారోగ్యపాలైతే నా అన్న వారు లేకుండా లేకుండా చేసింది.. దీంతో కరోన కట్టడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వరక్త, వాణిజ్య, వ్యాపార లావాదేవీలన్ని నిలిచిపోయాయి. ఆలయాలు, పర్యాటకస్థలాలన్ని రాకపోకలు లేక స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది.. ఈ కారణంగానే హైదరాబాద్ ప్రసిద్ధ గొల్కొండ కోట సందర్శనకు పర్యాటకుల అనుమతిని నిషేధించారు. గోల్కొండ కోట మళ్లీ తెరుచుకుంది. కరోనా నేపథ్యంలో దాదాపు ఆరు నెలలుగా మూతపడిన కోటను సందర్శించడానికి పర్యటకులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆన్ లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా పర్యాటక స్థలాలకు మినహాయింపు ఇవ్వడంతో ఇవాళ్టి నుంచి సందర్శకులకు అనుమతినిస్తున్నారు. ఆన్ లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికి ధర్మల్ స్కీనింగ్ చేస్తున్నారు. మాస్కులు ఉంటేనే లోపలికి పంపిస్తున్నమని.. అలాగే ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.