సినీ ఫక్కీలో పాల కల్తీ.. ఎలానో తెలుసా…

హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురాలోని జహంగీర్ డైరీ ఫామ్ లో నిత్యం జరుగుతున్న కల్తీ పాల వ్యవహారం ఒక్కసారిగా బయట పడింది. అది కూడా సినిమాలో ఫన్నీ సీను తలపించింది. గేదె నుంచి పాలను పితికిన...

సినీ ఫక్కీలో పాల కల్తీ.. ఎలానో తెలుసా...

Updated on: Aug 19, 2020 | 12:24 PM

కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ డైరీని పట్టించారు హైదరాబాద్ పాతబస్తీ జనం. ఇంత కాలం గుట్టుగా సాగుతున్న కల్తీ కథను బయటపెట్టారు. సగం పాలలో.. సగం నీళ్లు కలుపుతూ మోసానికి పాల్పడుతున్న డైరీ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. కల్తీ చేస్తున్న వీడియోని స్థానిక పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురాలోని జహంగీర్ డైరీ ఫామ్ లో నిత్యం జరుగుతున్న కల్తీ పాల వ్యవహారం ఒక్కసారిగా బయట పడింది. అది కూడా సినిమాలో ఫన్నీ సీను తలపించింది. గేదె నుంచి పాలను పితికిన తర్వాత అందులోని ఓ లీటర్ పాలను అక్కడే తాగేసి.. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే గిన్నెలో పోశాడు. అంతకు సరిపడ నీటిని కలిపేశాడు. ఆ నీరు కూడా గేదెలకు కోసం ఏర్పాటు చేసిన నీటి తొట్టిలోనివి. ఇదంతా..  డైరీ ఫామ్ పక్కనే ఉన్న బిల్డింగ్‌పై నుంచి వీడియోను రికార్డ్ చేశారు స్థానిక యువకులు.

ఈ వీడియోను డబీర్పురాలోని పోలీసులకు అప్పగించారు. నిత్యం సోహెల్ అనే వ్యక్తి చేస్తున్న కల్తీని సాక్షాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి… విచారణ చేస్తున్నారు.