గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరి డెడ్ బాడీ

|

Jun 10, 2020 | 12:39 PM

కరోనా బాధితులకు సంజీవినిగా మారిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి సంచలనంగా మారింది. ఈసారి చనిపోయిన కరోనా పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారయ్యాయి.

గాంధీ సిబ్బంది నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరి డెడ్ బాడీ
Follow us on

కరోనా బాధితులకు సంజీవినిగా మారిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి సంచలనంగా మారింది. ఈసారి చనిపోయిన కరోనా పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారయ్యాయి. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. దీంతో బంధువులు శ్మశానం దాకా తీసుకెళ్లారు. తీరా సమాధి చేస్తుండగా తప్పును గుర్తించారు. దీంతో డెడ్ బాడీని వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తిరిగి తీసుకొచ్చేశారు. తర్వాత అధికారులు వాళ్లకు సంబంధించి వ్యక్తి డెడ్ బాడీని అప్పగించారు. హైదరాబాద్‌లోని బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన ఓ కరోనా పేషేంట్ (48) గాంధీ హాస్పిటల్స్ లో చనిపోయారు. హాస్పిటల్ స్టాఫ్ డెడ్ బాడీని బంధువులకు అప్పగించగా.. వాళ్లు శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. క
డసారి చూసేందుకు ఆ వ్యక్తి భార్య డెడ్ బాడీ మొఖం చూసింది. దీంతో షాక్ అయిన తన భర్తది కాదని గుర్తించింది. దీంతో బాడీని అంబులెన్స్​లో గాంధీ మార్చురీకి తీసుకొచ్చారు. డాక్టర్లు, హెల్త్​ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, మార్చురీలో వాళ్లకు సంబంధించిన వ్యక్తి బాడీని గుర్తించడంతో శాంతించారు. గాంధీ హాస్పిటల్‌కు భారీగా కరోనా పేషెంట్లు వస్తుండటంతో.. డాక్టర్లు, సిబ్బందిపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని దీంతో పొరపాటు జరిగి ఉండొచ్చని అంటున్నారు ఆస్పత్రి అధికారులు.