అడిలైడ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత్‌కు ఘోర పరాభవం ఎదురయిన విషయం తెలిసిందే. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఘోర ఓటమిని మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటును భర్తీ చేస్తూ 90 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఏ ఫార్మాట్ అయినా రెచ్చిపోయే కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో ద్రవిడ్‌గా పేరు తెచ్చుకున్న చటేశ్వర్ పుజారా.. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా లాంటి అద్భుతమైన యువ ప్లేయర్లు… మిడిలార్డర్‌లో మంచి అనుభవం ఉన్న రహానే, విహారి, సాహా వంటి వాళ్లు ఉన్నా కూడా ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చెయ్యలేదు. ఇండియా క్రికెట్ టీమ్ ఎనిమిదన్నర దశాబ్దాల టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇంత తక్కువ స్కోర్‌కే ఆలౌటైన జట్టుగా కోహ్లీసేన పేరుతెచ్చుకుంది.
ఈ ఓటమి టీమిండియాపై ఊహించని ఒత్తిడిని తీసుకొచ్చింది. అదేదో గల్లీ ప్లేయర్స్ మాదిరి..మన బ్యాట్స్‌మెన్ అలా క్రీజ్‌లోకి వెళ్లి..ఇలా రావడాన్ని అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పలువురు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు మన జట్టులోని పలువురు సెలక్టర్లు, కోచ్‌లు, ఆటగాళ్లపై విర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘోర ఓటిమికి బాధ్యతను హెడ్ కోచ్ రవిశాస్త్రి తీసుకోవాల్సి ఉంటుందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆయన్ను తొలగించి..ఆ ప్లేసులో రాహుల్ ద్రవిడ్‌ను నియమించాలని ట్వీట్లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్‌గా కోహ్లీని తొలగించి.. అతని ప్లేసులో రోహిత్ శర్మను నియమించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.
Everyone connected with team India’s horrible performance should be fucking accountable. Whole team management including the piece of shit RAVI SHASTRI, fielding coach, Batting coach and everybody else. @BCCI @SGanguly99 looks to be handicapped.
— Psy (@PsyfeR88) December 19, 2020
Everyone connected with team India’s horrible performance should be fucking accountable. Whole team management including the piece of shit RAVI SHASTRI, fielding coach, Batting coach and everybody else. @BCCI @SGanguly99 looks to be handicapped.
— Psy (@PsyfeR88) December 19, 2020
Yaar Rahul Dravid ko hi Indian coach bana do please but get rid of Ravi Shastri
— Ravi Shastri Fan Club (@mittalrag) December 19, 2020
Also Read :
Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ