డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..

|

Aug 19, 2020 | 6:24 PM

డిలీట్ చేసిన వాటిని తిరిగి చూసే వీలుంటే బాగుంటుందని అని అనిపిస్తుంది. లేట్ ఎందుకు అలాంటి వాటిని మనం 30 రోజులలోపు తిరిగి రికవర్ చేసుకునే వీలు ఉంటుంది.

డిలేట్ చేసిన వాట్సాప్ వీడియోలు, ఇమేజ్స్‌ను రికవర్ చేయండిలా..
Follow us on

Deleted Whatsapp Videos And Images: ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉద్యోగం.. ఈ మధ్యకాలంలో ఇలా అన్నింటికీ ఒక్కో వాట్సాప్ గ్రూప్ మైంటైన్ చేస్తుంటాం. కొన్నిసార్లు అందులో వచ్చిన ఫోటోస్ గానీ వీడియోలు గానీ, మెసేజ్స్ గానీ ఎక్కువైతే.. ఫోన్ స్పేస్ తగ్గిపోతుందని అని చెప్పి మనం డిలీట్ చేస్తాం. ఇక వాటిల్లో కొన్ని ముఖ్యమైన ఫోటోస్, వీడియోస్ ఉండవచ్చు. ఇక అలా డిలీట్ చేసిన వాటిని తిరిగి చూసే వీలుంటే బాగుంటుందని అని అనిపిస్తుంది. లేట్ ఎందుకు అలాంటి వాటిని మనం 30 రోజులలోపు తిరిగి రికవర్ చేసుకునే వీలు ఉంటుంది.

డిలీట్ చేసిన డేటా అంతా కూడా ఒక నెల వరకు వాట్సాప్ సర్వర్‌లో ఉంటుంది. ఒకవేళ యూజర్లు చాట్ చేసుకున్న సెషన్ మొత్తాన్ని డిలీట్ చేయకపోతే మనం తిరిగి ఫోటోను గానీ వీడియోను గానీ డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. అది కూడా నెల రోజుల వ్యవధిలోనే రికవర్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి.!

వాట్సాప్‌లో ఫోటోస్ డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు ప్రతీసారి ‘డౌన్‌లోడ్ చేయలేరు’ అనే మెసేజ్ వస్తుంది. అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ముందుగా మన ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఆన్‌లో ఉందా.? లేదా.? అనేది చూసుకోవాలి. అంతేకాకుండా టైం, డేట్ కరెక్ట్‌గా ఉండాలి. అటు ఫోన్ స్టోరేజీ ఫుల్ అయిపోయినప్పుడు కూడా వాట్సాప్ సర్వర్ కనెక్షన్ ఫెయిల్ వస్తుంది. కాగా, ఆండ్రాయిడ్ యూజర్లు అయితే వాట్సాప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ చేయడానికి ‘Auto Downloads’ అనే ఆప్షన్‌ను Enable చేసుకోవచ్చు.