సభ్యులపై అనర్హత వేటు ఎలా పడుతుంది..?

| Edited By:

Jan 01, 2020 | 5:37 AM

రాజకీయాల్లో ఆయా రామ్.. గయా రామ్ అన్న పదం వింటూ ఉంటాం. అసలు ఈ పదం ఎందుకొచ్చిందన్న దానిపై చాలా మందికి తెలియదు. రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ చేసే వారిని.. ఆ తర్వాత మరో పార్టీలోకి మారేవారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు. 1967 సంవత్సరంలో హర్యానాలో ఒ ఎమ్మెల్యే ఒకే రోజు మూడు పార్టీలు మారారు. అయన పేరు గయా లాల్. అయితే ఇలా […]

సభ్యులపై అనర్హత వేటు ఎలా పడుతుంది..?
Follow us on

రాజకీయాల్లో ఆయా రామ్.. గయా రామ్ అన్న పదం వింటూ ఉంటాం. అసలు ఈ పదం ఎందుకొచ్చిందన్న దానిపై చాలా మందికి తెలియదు. రాజకీయ క్షేత్రంలో ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. ఆ తర్వాత మరో పార్టీలోకి జంప్ చేసే వారిని.. ఆ తర్వాత మరో పార్టీలోకి మారేవారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తుంటారు. 1967 సంవత్సరంలో హర్యానాలో ఒ ఎమ్మెల్యే ఒకే రోజు మూడు పార్టీలు మారారు. అయన పేరు గయా లాల్. అయితే ఇలా పార్టీలు మారే వారే వారికి చెక్ పెట్టేందుకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా.. పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిని పదవ షెడ్యూల్‌లో చేర్చారు.

ఈ ఫిరాయింపుల చట్టం ద్వారా.. సభ్యులను డిస్‌క్వాలిఫై చేయొచ్చు. అయితే ఇదంతా ఓ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. పార్టీ మారిన సమయంలో కానీ.. లేక పార్టీ ఆదేశాలను ధిక్కరించినప్పుడు కానీ.. విప్ జారీ చేసిన సమయంలో పార్టీ చెప్పిన విధంగా నడుచుకోకుండా.. ఉన్న సమయంలో అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సభలో జరిగే ఓటింగ్ సమయంలో కూడా పార్టీకి వ్యతిరేకంగా ఓటింగ్‌కు పాల్పడితే.. సదరు సభ్యుడిపై అనర్హత వేటు వేయవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారాలు సభలో ఉన్న స్పీకర్‌కు మాత్రమే ఉంటాయి. సదరు సభ్యుడిపై సంబంధిత పార్టీ స్పీకర్‌కు లేఖలో పేర్కొనాలి. అప్పుడు స్పీకర్ తీసుకునే నిర్ఱయం ఆధారంగా అనర్హత వేటు పడుతుంది. అయితే ఇక్కడ పార్టీ మారే ఎమ్మెల్యేలకు అనర్హత వేటు పడకుండా కూడా మరో అవకాశం ఉంది. ఒకవేళ సదరు పార్టీకి చెందిన సభ్యులు మూడింట రెండువంతుల మంది సభ్యులంతా ఒకే పార్టీలో మారాలనుకుంటే.. అప్పుడు సదరు పార్టీనే విలీనం చేయవచ్చు. అప్పుడు.. అసలు పార్టీలో ఉన్న సభ్యులే అనర్హతను ఎదుర్కొంటారు.