యువకుడి వెబ్ సిరీస్‌ల పిచ్చి.. 75 మంది ప్రాణాలు సేఫ్..

ఓ యువకుడికి వెబ్ సిరీస్‌ల పిచ్చి.. 75 మంది ప్రాణాలను రక్షించింది. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. ఈ సంఘటన ముంబైలోని దొంబివిలిలో చోటు చేసుకుంది.

యువకుడి వెబ్ సిరీస్‌ల పిచ్చి.. 75 మంది ప్రాణాలు సేఫ్..

Updated on: Oct 31, 2020 | 5:11 PM

ఓ యువకుడికి వెబ్ సిరీస్‌ల పిచ్చి.. 75 మంది ప్రాణాలను రక్షించింది. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. ఈ సంఘటన ముంబైలోని దొంబివిలిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దొంబివిలిలోని కోపర్ ఏరియాలో చెందిన కునాల్ అనే యువకుడు అక్కడున్న రెండంతస్థుల భవనంలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడికి వెబ్ సిరీస్‌లంటే చాలా ఇష్టం. రోజూ రాత్రిపూట ఏదొక వెబ్ సిరీస్ చూసి పడుకోవడం అతడికి అలవాటు.

ఈ క్రమంలోనే అతడు బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారు జామున 4 గంటల వరకు ఓ వెబ్ సిరీస్ చూస్తూనే ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో తన ఇంటి కిచెన్‌లోని ఓ భాగం కూలిపోవడం గమనించాడు. దీనితో వెంటనే నిద్రిస్తున్న తన కుటుంబంతో పాటు.. ఆ భవనంలోని 75 మందిని నిద్రలేపి.. అందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఇక వారు వచ్చిన కొద్దిసేపటిలోనే ఆ భవనం కుప్ప కూలిపోయింది.

కాగా, కునాల్‌కు ఉన్న ఆ వెబ్ సిరీస్‌ల పిచ్చే తమ ప్రాణాలను కాపాడిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. కునాల్ చేసిన ఈ పనికి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, శిధిలావస్థలో ఉన్న ఆ భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు తొమ్మిది నెలలు క్రితమే నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ ఉంటున్న వారంతా ఆర్ధికంగా చితికిపోవడంతో.. ఆ భవనాన్ని ఎవరూ ఖాళీ చేయలేదు.

Follow Us