థాణేలో కరోనా బాధితుడి డెడ్ బాడీ తారుమారు

|

Jul 08, 2020 | 12:12 PM

కరోనాతో సతమతమవుతున్న జనానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మరింత గందరగోళానికి గురి చేస్తోంది. కొవిడ్ బారిన పడి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తారుమారు చేశారు. ఎట్టకేలకు అదృశ్యమైన డెడ్ బాడీని కనుగొన్నారు. అప్పటికే ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

థాణేలో కరోనా బాధితుడి డెడ్ బాడీ తారుమారు
Follow us on

కరోనాతో సతమతమవుతున్న జనానికి ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మరింత గందరగోళానికి గురి చేస్తోంది. కొవిడ్ బారిన పడి చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తారుమారు చేశారు. ఎట్టకేలకు అదృశ్యమైన డెడ్ బాడీని కనుగొన్నారు. అప్పటికే ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.

థాణే నగరంలో కొద్ది రోజుల క్రితం అదృశ్య‌మైన‌‌ కోవిడ్ -19 బాధితుని స‌మాచారం ఆల‌స్యంగా వెలుగుచూసింది. ఆ బాధితుని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది మరొక కుటుంబానికి అప్పగించినట్లు తే‌లింది. ఆసుపత్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. జూన్ 29 న గ్లోబల్ హబ్ ఆసుపత్రిలో 72 ఏళ్ల క‌రోనా బాధితుడిని అత‌ని కుటుంబీకులు కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతడు అదృశ్య‌మయ్యాడు. దీంతో కంగారుపడ్డ అత‌ని కుటుంబీకులు కపూర్బావాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే అతని మృత‌దేహాన్ని రెండు రోజుల క్రితం కోప్రిలోని ఒక కుటుంబానికి ఆసుప‌త్రి సిబ్బంది అప్పగించినట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. దీంతో వారు ఆ మృత‌దేహానికి వెంట‌నే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. కాగా ఆసుప‌త్రి సిబ్బంది తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ఇద్దరు బాధితుల చికిత్స‌కు సంబంధించిన రిపోర్టులు తారుమారైన‌ కార‌ణంగా ఈ గంద‌ర‌గోళం చోటుచేసుకుంది. అస్పత్రి సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.