చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టం.. హాంకాంగ్ జర్నలిస్టుల ‘కష్టం’ !

హాంకాంగ్ పై పట్టు కోసం చైనా తెచ్చిన  జాతీయ భద్రతా చట్టం అక్కడి జర్నలిస్టులు, లాయర్లకు తలనొప్పిని తెచ్చి పెడుతోంది. తికమక రేపుతున్న ఈ చట్టంలోని కొన్ని పదాలు, నేరాలకు ఇఛ్చిన నిర్వచనాలు వారిని అయోమయానికి..

చైనా తెచ్చిన జాతీయ భద్రతా చట్టం.. హాంకాంగ్ జర్నలిస్టుల 'కష్టం' !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2020 | 4:53 PM

హాంకాంగ్ పై పట్టు కోసం చైనా తెచ్చిన  జాతీయ భద్రతా చట్టం అక్కడి జర్నలిస్టులు, లాయర్లకు తలనొప్పిని తెచ్చి పెడుతోంది. తికమక రేపుతున్న ఈ చట్టంలోని కొన్ని పదాలు, నేరాలకు ఇఛ్చిన నిర్వచనాలు వారిని అయోమయానికి గురి చేస్తున్నాయి. కొన్ని నిర్వచనాలైతే వివక్షకు దారి తీసే విధంగా, నిరంకుశంగా ఉన్నాయని ఐరాస మానవ హక్కుల కార్యాలయమే పెదవి విరిచింది. ఈ ‘ లా’ లోని కంటెంట్లను ఈ ఆఫీసు ఇంకా విశ్లేషించే పనిలో ఉండగా.. తాజాగా నిషేధించిన ప్రజాస్వామ్య అనుకూల నినాదాలను తమ వార్తల్లో ప్రస్తావించాలో, లేదో తెలియక జర్నలిస్టులు  తలలు పట్టుకుంటున్నారు. విదేశీ రిపోర్టర్లతో సహా నగర మీడియాపైనా, పత్రికా స్వేఛ్చ పైన ఈ చట్టం చూపగల ప్రభావంపై క్లారిటీ ఇవ్వాలని హాంకాంగ్ లోని ‘ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్’.. నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ కి ఓపెన్ లెటర్ రాసింది.

ఈ జాతీయ భద్రతా చట్టం లోని కొన్ని వాక్యాలు, పదాలను తమకు ఎలా అన్వయించుకోవాలో వీరికి, అలాగే లాయర్లకు కూడా తోచడం లేదు. ఇవి తమ వార్తలపై ఆంక్షలు పెట్టేలా ఉందని పాత్రికేయులు… .. తాము కోర్టుల్లో కేసులు వాదించేటప్పుడు ఏ పదాలను వినియోగించాలో తెలియక లాయర్లు తర్జన భర్జన పడుతున్నారు. మీ నుంచి గ్యారంటీలు కావాలని వీరంతా నగర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని అభ్యర్థించారు.