ఇన్ఫోసిన్‌ ఫౌండేషన్‌కు కేంద్రం షాక్, ఏం జరిగింది?

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థకి షాకిచ్చింది కేంద్ర హోంశాఖ. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పేరిట ఈ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఐతే.. విదేశీ నిధుల నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ ఎన్జీఓ రిజిస్ర్టేషన్‌ను రద్దు చేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే తప్పనిసరిగా ఫారెన్ కంటిబ్యూషన్ యాక్ట్ కింద నమోదు కావాలి. ఆ విధంగా రిజిస్టరయిన స్వచ్చంధ సంస్థలు.. ఏటా తమ వార్షిక ఆదాయం, విదేశీ నిధుల వ్యయాలను […]

ఇన్ఫోసిన్‌ ఫౌండేషన్‌కు కేంద్రం షాక్, ఏం జరిగింది?
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

May 14, 2019 | 10:53 AM

ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థకి షాకిచ్చింది కేంద్ర హోంశాఖ. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పేరిట ఈ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఐతే.. విదేశీ నిధుల నిబంధనను ఉల్లంఘించినందుకు ఈ ఎన్జీఓ రిజిస్ర్టేషన్‌ను రద్దు చేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే తప్పనిసరిగా ఫారెన్ కంటిబ్యూషన్ యాక్ట్ కింద నమోదు కావాలి. ఆ విధంగా రిజిస్టరయిన స్వచ్చంధ సంస్థలు.. ఏటా తమ వార్షిక ఆదాయం, విదేశీ నిధుల వ్యయాలను హోంశాఖకు సమర్పించాలి. ఒకవేళ విదేశాల నుంచి ఎలాంటి విరాళాలు రాకపోయినా ‘నిల్’ రిటర్న్స్ అని దాఖలు చేయాలి.

ఆరేళ్లుగా ఆదాయ- వ్యయాల వివరాలు అందించలేదు ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఈ విషయమై పలుమార్లు హోంశాఖ నోటీసులు జారీచేసింది. దీనికి ఇన్ఫోసిన్ ఫౌండేషన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఫౌండేషన్‌ రిజిస్ర్టేషన్‌‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ధృవీకరించిన ఆ స్వచ్చంధ సంస్థ.. 2016లో చేసిన చట్ట సవరణ మేరకు తమ సంస్థ విదేశీ నిధుల నియంత్రణ చట్టం పరిధిలోకి రాదని హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. 1996లో స్థాపించిన ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌కు నారాయణమూర్తి భార్య సుధ ఛైర్‌పర్సన్‌గా వున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేషన్, హెల్త్, రూరల్ డెవలప్‌మెంట్, నిరుపేదల సంరక్షణకు ఈ ఫౌండేషన్‌ సేవలందిస్తున్న విషయం తెల్సిందే!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu