దేశ ప్రజలకు ఇదే నా భరోసా.. అమిత్ షా..

కోవిద్ 19 వైరస్ ను అరికట్టడానికి మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భరోసా కల్పించారు. దేశంలో సరిపోయేంత నిత్యావసర వస్తువులు,

దేశ ప్రజలకు ఇదే నా భరోసా.. అమిత్ షా..

Edited By:

Updated on: Apr 14, 2020 | 4:19 PM

కోవిద్ 19 వైరస్ ను అరికట్టడానికి మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భరోసా కల్పించారు. దేశంలో సరిపోయేంత నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, మందులు అందుబాటులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. సంపన్న ప్రజలు ముందుకు వచ్చి దేశంలోని పేదలకు సాయం చేయాల్సిన అవసరం వచ్చిందని, ముందుకు వచ్చి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా.. లాక్‌డౌన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం రాష్ట్రాలతో చర్చిస్తూ, సమన్వయం చేస్తూనే ఉందని, అయినా సరే, సమన్వయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని, వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.

[svt-event date=”14/04/2020,4:04PM” class=”svt-cd-green” ]

[svt-event date=”14/04/2020,4:07PM” class=”svt-cd-green” ]