‘ రన్ టామ్.. రన్ ‘…. సక్సెస్ నీదే కావచ్చు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హాలీవుడ్ స్టార్

| Edited By: Ravi Kiran

Dec 31, 2019 | 2:36 PM

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ 2020 లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. తనను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ వెరైటీగా ఓ ప్రమోషన్ పేరడీ వీడియో విడుదల చేశాడు. అమెరికా తదుపరి ప్రెసిడెంట్ తానే కావాలని స్లోగన్ ఇచ్చాడు కూడా..’ అమెరికా.. యూ కంప్లీట్ మీ ”.. అంటూ నిర్మానుష్య ప్రదేశంలో పరుగులు తీస్తూ అద్భుతమైన ‘ స్టంటే ‘ చేశాడు. టామ్ రాజకీయ అరంగేట్రం ‘ దశాబ్దాల తరబడి ఇతని మూవీల […]

 రన్ టామ్.. రన్ .... సక్సెస్ నీదే కావచ్చు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో హాలీవుడ్ స్టార్
Follow us on

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ 2020 లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. తనను సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ వెరైటీగా ఓ ప్రమోషన్ పేరడీ వీడియో విడుదల చేశాడు. అమెరికా తదుపరి ప్రెసిడెంట్ తానే కావాలని స్లోగన్ ఇచ్చాడు కూడా..’ అమెరికా.. యూ కంప్లీట్ మీ ”.. అంటూ నిర్మానుష్య ప్రదేశంలో పరుగులు తీస్తూ అద్భుతమైన ‘ స్టంటే ‘ చేశాడు. టామ్ రాజకీయ అరంగేట్రం ‘ దశాబ్దాల తరబడి ఇతని మూవీల లవర్స్ కి నిజంగా పండగే.. గత ఏడాది టామ్ నటించిన ‘ మిషన్ ఇంపాజిబుల్ ఫాలౌట్ ‘ బాక్స్ ఆఫీసును స్మాష్ చేసింది. తన మూవీల్లో నింగిన ఎగురుతున్న విమానాలనుంచి కిందకు జంప్ చేయడం, హెలికాఫ్టర్ నుంచి వేలాడడం వంటి ఒళ్ళు జలదరించే సీన్స్ లో నటించడంతో బాటు.. తన సొంత హెలికాఫ్టర్ స్టంట్ ఫ్లయింగ్ తో కూడా ఎంతోమందిని ఆకట్టుకున్నాడు. ‘ టాప్ గన్ ‘, ‘ ఎడ్జ్ ఆఫ్ టుమారో ‘, ‘ జాక్ రీచర్ ‘, ‘ ది మమ్మీ ‘, ‘ రిస్కీ ‘, ‘ జెర్రీ మాగ్వయిర్ ‘, వాల్ ఆఫ్ ది వాల్డ్స్ ‘, రెయిన్ మ్యాన్ ‘, ‘ లాస్ట్ సమురాయ్ ‘, ‘ ఇంటర్వ్యూ విత్ ది వంపైర్ ‘ వంటి ఈ నటుడి సినిమాలు ఇప్పటికీ జనాలను అలరిస్తూనే ఉన్నాయి. 2015 లో ఇతను నటించిన ‘ మిషన్ ఇంపాజిబుల్ ‘ మూవీకి సీక్వెల్ గా మళ్ళీ 2018 లో ‘ మిషన్ ఇంపాజిబుల్.. ఫాలౌట్ ‘ తీశారు.

అమెరికా రాజకీయాల్లో హాలీవుడ్ స్టార్స్ తలదూర్చడం అరుదు. ఈ సందర్భంగా రోనాల్డ్ రీగన్ ని చెప్పుకోవచ్చు. ‘ బెడ్ టైం ఫర్ బోంజో ‘ అనే మూవీలో ఓ చింపాంజీతో కలిసి నటించిన రీగన్.. ఆ తరువాత కాలిఫోర్నియా గవర్నర్ అయ్యాడు. అంతేకాదు.. రెండు సార్లు అమెరికా ప్రెసిడెంట్ కూడా పదవి చేబట్టాడు. ఇలాగే ఫ్రెండ్ థాంప్సన్, క్లింట్ ఈస్ట్ వుడ్, సింధియా నిక్సన్ వంటి స్టార్లు రాజకీయాల్లో తమ పరిణతి ప్రదర్శించారు. ఇక ఇప్పుడు.. టామ్ క్రూజ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఇతని విజయం ఇతని సినిమాల సక్సెస్ మాదిరే సాధ్యపడుతుందా అన్నది వేచి చూడాలి..