భూ యాజమానుల వాటా పెంచిన హెచ్‌ఎండీఏ..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 05, 2020 | 6:13 PM

హెచ్‌ఎండీఏ పరిధిలోని భూ యాజమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూ యజమానులకు 10 శాతం వాటా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

భూ యాజమానుల వాటా పెంచిన హెచ్‌ఎండీఏ..!
Follow us on

హెచ్‌ఎండీఏ పరిధిలోని భూ యాజమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇకపై హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూ యజమానులకు 10 శాతం వాటా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూ యజమానులకు 60 శాతం, హెచ్‌ఎండీఏకు 40 శాతం వరకు వాటా రానుంది. ఇప్పటివరకు భూయజమానులకు 50 శాతం, హెచ్‌ఎండీఏకు 50 శాతంగా ఉంటోంది. కొత్త జీవో ప్రకారం ల్యాండ్‌పూలింగ్‌ భూములకు భద్రత, ప్రయోజనం చేకూరుస్తామని హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు.
ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూములిచ్చేవారికి సమస్య లేకుండా చూస్తామన్న హెచ్‌ఎండీఏ.. అన్నిరకాల అనుమతులు సకాలంలో పూర్తయ్యేలా తామే చూస్తామని తెలిపింది. భూములిచ్చిన వారి రిజిస్ట్రేషన్‌ ఖర్చులు కూడా తామే భరిస్తామని హెచ్‌ఎండీఏ పేర్కొంది. లేఔట్‌, ముసాయిదా ఆమోదం పొందిన 6 నెలల్లో భూ యజమానులకు ప్లాట్లు కేటాయిస్తామని స్పష్టం చేసింది. ఫ్లాట్ల క్రయవిక్రయాలకు సంబంధించి యాజమానులకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో 500 ఎకరాల్లో ల్యాండ్‌ పూలింగ్‌ ప్రాజెక్టులు అభివృద్ధిలో ఉన్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది.