ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఎంతంటే.!

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రజల నుంచి రెవెన్యూశాఖ అభిప్రాయాలు సేకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 30 శాతం వరకు భూముల ధరలను..

ఏపీలో పెరిగిన భూముల ధరలు.. ఎంతంటే.!

Updated on: Aug 10, 2020 | 11:55 PM

Hiked Prices Of Lands In AP: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో పెంచిన భూముల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రజల నుంచి రెవెన్యూశాఖ అభిప్రాయాలు సేకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 30 శాతం వరకు భూముల ధరలను ఏపీ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విజయవాడ, గుంటూరు నగరాల్లో 10 శాతం, విశాఖపట్నంలో 25 శాతం, అనంతపురంలో 30 శాతం మేరకు భూముల ధరలను పెంచింది.

ఇక పెంచిన భూముల ధరలతో రూ. 800 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా, మార్కెట్ ధరకు, ప్రభుత్వం నిర్దేశించిన ధరకు మధ్య వ్యత్యాసం తగ్గించేలా ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. అటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం స్థిరంగానే ఉంటాయని స్పష్టం చేసింది.

Also Read:

ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త.. ప్రీమియం చెల్లించని వారికి మరో ఛాన్స్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వేలిముద్ర లేకుండా పింఛన్ల పంపిణీ..