మైనింగ్ లీజుల రద్దు విషయంలో టీడీపీ నేత‌కు హైకోర్టులో ఊరట

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మైనింగ్ లీజుల రద్దు విషయంలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి హైకోర్టులో ఊరట ల‌భించింది.

మైనింగ్ లీజుల రద్దు విషయంలో టీడీపీ నేత‌కు హైకోర్టులో ఊరట

Updated on: Aug 27, 2020 | 4:42 PM

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మైనింగ్ లీజుల రద్దు విషయంలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకి హైకోర్టులో ఊరట ల‌భించింది. ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ మైనింగ్ లీజులు రద్దు చేస్తూ ఏపీ సర్కార్ ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ప్ర‌భుత్వ ఆదేశాల‌పై పోతుల హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో ఉన్నత న్యాయ‌స్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఈ ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేశారని స‌మాచారం. ఈ క్ర‌మంలో టీడీపీ శాస‌న‌స‌భ్యుడు గొట్టిపాటికి చెందిన ఐదు క్వారీలు.. ఆయ‌న అనుచ‌రుల‌కు సంబంధించిన ఆరు క్వారీల లీజు క్యాన్సిల్ అయ్యాయి. పోతుల రామారావుకు సంబంధించిన ఒక క్వారీ లీజు క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం.

Also Read :

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

 ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

నేష‌న‌ల్ హైవేపై నోట్ల కట్టల క‌ల‌క‌లం