ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన సొరంగ ‌మార్గం సిద్ధం…

ప్ర‌పంచంలోనే అతిపొడ‌వైన సొరంగ మార్గం రూపుదిద్దుకుంటోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో క‌నువిందు చేయ‌నుంది. 10 వేల అడుగుల ఎత్తులో చేప‌ట్టిన ఈ సొరంగ‌మార్గం నిర్మాణపనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితమివ్వబోతున్నారు.

ప్ర‌పంచంలోనే అతి పొడ‌వైన సొరంగ ‌మార్గం సిద్ధం...
Follow us

|

Updated on: Aug 27, 2020 | 4:08 PM

ప్ర‌పంచంలోనే అతిపొడ‌వైన సొరంగ మార్గం రూపుదిద్దుకుంటోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో క‌నువిందు చేయ‌నుంది. 10 వేల అడుగుల ఎత్తులో చేప‌ట్టిన ఈ సొరంగ‌మార్గం నిర్మాణపనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితమివ్వబోతున్నారు. ఇది మనాలి లేహ్‌ హైవేపై రోహ్తాంగ్ పాస్ కింద నిర్మిస్తున్న ఈ టర్నల్ కి పదేళ్ల కాలం పట్టింది. ఇది ల‌ఢాఖ్ తో అనుసంధాన‌ం కానుంది. ఈ సొరంగ మార్గం మనాలి లేహ్‌ మధ్య దూరం సుమారు 46 కిలోమీటర్లు తగ్గ‌నుంది. ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని, భారత‌ రత్న అటల్ బిహారీ వాజ‌పేయి పేరు పెట్టారు. అటల్ రోహ్తాంగ్ టన్నెల్ గా పిలువబోతున్నారు.

10,171 అడుగుల ఎత్తులో నిర్మిత‌మైన‌ ఈ అటల్ రోహ్తాంగ్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్త‌యిన,‌ పొడవైన రహదారి సొరంగం మార్గం. ఇది సుమారు 8.8 కిలోమీట‌ర్ల వెడ‌ల్పును క‌లిగివుంటుంది. ఈ నూత‌న సొంగమార్గం నిర్మాణంతో మనాలి నుంచి లేహ్‌కు కేవలం 10 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు. ఈ మార్గాన్ని సెప్టెంబరు చివరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు.

ఈ సొరంగం మనాలిని లేహ్‌తో అనుసంధానించడమే కాకుండా, హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పితిలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. ఇది లాహోల్ స్పితి జిల్లాను కులు జిల్లాలోని మనాలితో కలుపుతుంది. లదాఖ్‌లో మోహరించిన భారత సైనికుల‌కు ఈ సొరంగ మార్గం కార‌ణంగా ఎంతో ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. శీతాకాలంలో ఆయుధాలు, లాజిస్టిక్స్ సరఫరా సులభత‌ర‌మ‌వుతుంది. ఈ సొరంగం లోపల ఏ వాహనం అయినా గంటకు గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించేందుకు అవ‌కాశ‌ముంది.

ఈ నిర్మాణం 2010, జూన్ 28న‌ పునాది పడింది. దీనిని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) నిర్మిస్తోంది. ఈ సొరంగం గుర్రపుడెక్క ఆకారంలో నిర్మిత‌మ‌య్యింది. ‌బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు, సిబ్బంది దీనిని నిర్మించేందుకు ఎంతో శ్ర‌మించారు. శీతాకాలంలో ఈ ప్రాంతంలో పనిచేయడం చాలా కష్టం. ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 30 డిగ్రీల వరకు ప‌డిపోతుంటాయి. ఈ సొరంగం నిర్మాణ సమయంలో 8 లక్ష క్యూబిక్ మీటర్ల రాయి, మట్టిని త‌వ్వితీశారు. వేసవిలో రోజుకు ఐదు మీటర్లు మేర‌కు తవ్వ‌గ‌లిగిన‌ప్ప‌టికీ, శీతాకాలంలో ఇది అర మీటరు మాత్ర‌మే త‌వ్వ‌గ‌లిగేవారు. కాగా, 3,000 కార్లు లేదా 1,500 ట్రక్కులు ఒకేసారి బయటకు వచ్చే విధంగా ఈ సొరంగ మార్గం నిర్మిత‌మ‌య్యింది. సుమారు రూ. 4 వేల కోట్ల రూపాయలు వెచ్చించి, ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఇందుకోసం అత్యాధునిక ఆస్ట్రేలియన్ టన్నెలింగ్ పద్ధతులను అనుస‌రించారు. ఇందులోని వెంటిలేషన్ వ్యవస్థ కూడా ఆస్ట్రేలియన్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ చివరి నాటికల్లా ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.