ఆర్టికల్ 370 రద్దు… ఏడు రాష్ట్రాల్లో హై అలర్ట్!

| Edited By:

Aug 08, 2019 | 7:15 PM

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పుల్వామా తరహా ఉగ్రదాడులు జరగొచ్చంటూ నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. కశ్మీర్‌ లోయతో పాటు దేశంలోని కనీసం ఏడు రాష్ట్రాల్లో భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. దాడుల కోసం సదరు ఉగ్రసంస్థకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారం కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో 50 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన […]

ఆర్టికల్ 370 రద్దు... ఏడు రాష్ట్రాల్లో హై అలర్ట్!
Follow us on

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పుల్వామా తరహా ఉగ్రదాడులు జరగొచ్చంటూ నిఘా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి. కశ్మీర్‌ లోయతో పాటు దేశంలోని కనీసం ఏడు రాష్ట్రాల్లో భారీ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్ కుట్రపన్నినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. దాడుల కోసం సదరు ఉగ్రసంస్థకు పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారం కూడా ఉన్నట్టు సమాచారం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన దాడిలో 50 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఆర్మీ, పోలీసులు, ఇతర సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు జైషే కుట్రపన్నినట్టు తెలుస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో వైమానిక దాడులు జరగొచ్చన్న హెచ్చరికలతో ఇప్పటికే అన్ని విమానాశ్రయాల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 10 నుంచి 20 వరకు టికెట్లు తీసుకున్న ప్రయాణికులు తప్ప సందర్శకులెవరినీ విమానాశ్రయాల్లోకి అనుమతించరు.