అదే పనిగా వెక్కిల్లు వస్తున్నాయా.? అయితే ఓసారి కరోనా పరీక్ష చేయించుకోండి. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన వైద్యులు.

మీకు అదే పనిగా వెక్కిల్లు వస్తుంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బాధితుల్లో ఎడతెరపిలేని వెక్కిల్లు కూడా ఓ లక్షణమని వైద్యులు చెబుతున్నారు. కరోనా బాధితుల్లో కనినిపంచే లక్షణాల్లో వెక్కిళ్లు అరుదుగా కనిపిస్తున్నాయన్ని చెబుతున్నారు.

అదే పనిగా వెక్కిల్లు వస్తున్నాయా.? అయితే ఓసారి కరోనా పరీక్ష చేయించుకోండి. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన వైద్యులు.
Narender Vaitla

|

Dec 19, 2020 | 2:52 PM

Hiccups maybe Carona new sign:జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇప్పటి వరకు మనకు తెలిసిన కరోనా లక్షణాలు ఇవే.. అయితే ఇప్పుడీ జాబితాలో మరో కోత్త లక్షణం వచ్చి చేరిందని నిపుణులు చెబుతున్నారు. మీకు అదే పనిగా వెక్కిల్లు వస్తుంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బాధితుల్లో ఎడతెరపిలేని వెక్కిల్లు కూడా ఓ లక్షణమని వైద్యులు చెబుతున్నారు. కరోనా బాధితుల్లో కనినిపంచే లక్షణాల్లో వెక్కిళ్లు అరుదుగా కనిపిస్తున్నాయన్ని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని కానీ.. అదే పనిగా వెక్కిళ్లు వస్తుంటే మాత్రం కచ్చితంగా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 64 ఏళ్ల ఓ వ్యక్తిగా ఏకంగా 72 గంటలు ఎడతెరపి లేకుండా వెక్కిళ్లు రావడంతో వైద్యులను సంప్రదించాడు. వైద్యులు పరీక్ష నిర్వహించడంతో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఊపిరితిత్తుల్లో తెల్ల రక్త కణాలు తగ్గడంతో పాటు రెండింటిలోనూ కరోనా వైరస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే దీర్ఘకాలంగా వెక్కిళ్లు కచ్చితంగా కరోనా కొత్త లక్షణం అని చెప్పడానికి మరికొన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు రోజులకు మించి వెక్కిళ్లు వస్తుంటే మాత్రం కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu