”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని.. దీనిపై తెలంగాణ ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు.

టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు..

Updated on: Aug 31, 2020 | 6:34 AM

Madhavi Latha Sensational Comments: టాలీవుడ్ ఇండస్ట్రీపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవని.. దీనిపై తెలంగాణ ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. తాజాగా ఆమె దీనిపై ట్వీట్ చేశారు. 2009 నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతోందన్నారు.

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలపై ఎన్సీబీ అధికారులు దృష్టి సారించాలని కోరారు. అలాగే సుశాంత్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అడుగుపెట్టడాన్ని స్వాగతించిన ఆమె.. టాలీవుడ్‌పై కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందన్న మాట నిజమేనని.. అదే విధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉందంటూ మాధవీలత పేర్కొంది.

Also Read: ఓటీటీలో విడుదల కానున్న ‘కలర్ ఫోటో’..!

Loading...
Unable to load recommendations.
Follow Us