AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘భద్రాచలం’తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం 46 ఏళ్లకే..

సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ వయసులో కన్నుమూసిన నటుల్లో ఇతను కూడా ఒకరు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించి స్టార్ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతను 46 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందారు.

Tollywood: 'భద్రాచలం'తో పాటు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం 46 ఏళ్లకే..
Actor Kazan Khan
Basha Shek
|

Updated on: Jul 30, 2026 | 7:00 PM

Share

కజన్ ఖాన్.. ఈ పేరు చెబితే ఎవరు గుర్తు పట్టలేరు కానీ.. శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమా విలన్ అంటే ఇట్టే ఓ భారీ కాయం మన కళ్ల ముందు మెదులుతుంది. ఈ సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు కజన్ ఖాన్. చూడ్డానికి హీరో మెటీరియల్ అయినా ప్రతినాయక పాత్రలతోనే బాగా ఫేమస్ అయ్యారీ ట్యాలెంటెడ్ యాక్టర్.  కేరళలో పుట్టిన కజాన్‌ ఖాన్‌ 1992లో వచ్చిన ‘సెంతమిట్‌ పట్టు’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను తెలుగులో ‘అమ్మకొడుకు’  అనే పేరుతో విడుదల చేశారు. రాజశేఖర్ గా నటించిన ఈ సినిమాతోనే నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కజాన్ ఖాన్. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన దేవుడు సినిమాలోనూ యాక్ట్ చేశారు.  రైల్వే కూలి, నాగార్జున ఎదురులేని మనిషి, చిన్నా, పలనాటి బ్రహ్మనాయుడు, 786 ఖైదీ ప్రేమకథ, అధిపతి, బ్రహ్మాచలం, విలన్.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా చేశారు  కజన్ ఖాన్. ముఖ్యంగా రియల్ స్టార్ శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాలోనూ ప్రతినాయకుడిగా నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే 2005 తర్వాత తెలుగులో సినిమాలేవీ చేయలేదు కజన్ ఖాన్. అయితే తమిళ్‌, మలయాళంలో మాత్రం వరుసగా సినిమాలు చేశాడు.

గంధర్వం, సిఐడి మూస, ద కింగ్, వర్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధి రాజా వంటి మలయాళ సినిమాలతో పాటు కన్నడ, హిందీ భాషల్లోనూ విలన్ రోల్స్ చేశాడు కజన్. కాగా 2015లో వచ్చిన లైలా ఓ లైలా అనే మలయాశం మూవీలో ఆఖరి సారిగా కనిపించారీ నటుడు. తెలుగు,  తమిళం, మలయాళం, కన్నడ బాషల్లో కలుపుకొని.. సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు కజాన్ కాన్. కాగా సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయిన తర్వాత తన సొంత రాష్ట్రమైన కేరళలో కొన్ని వ్యాపారాలు చేశారాలు కజన్ ఖాన్. అందులోనూ మంచి లాభాలు సాధించాడు. అయితే ఉన్నట్లుండి 2023 జూన్ 12 రాత్రి అకాల మరణం చెందారు కజాన్ ఖాన్. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్కీన్ అయినా ఎంతో ఫిట్ గా ఉండే ఆయన గుండె పోటుతో కన్నమూశాడని డాక్టర్లు ధ్రువీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us