Power Star Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ ను షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ శరవేగంగా మిగిలిన సినిమాలను కూడా పూర్తి చేస్తున్నాడు. ఈ రీమేక్ తోపాటు క్రిష్ సినిమాను కూడా శరవేగంగా కంప్లీట్ చేయాలనీ చూస్తున్నాడు పవన్. ఇక ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ తో చేసే సినిమా కూడా ఊపందుకుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లాలని దర్శకుడు హరీష్ శంకర్ చూస్తున్నారు. అందుకే స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసి పెట్టుకుని పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు హరీష్. అదే విధంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ కోసం హరీష్ వేట మొదలు పెట్టాడట. అయితే ఇప్పడు హీరోయిన్ కూడా ఫైనల్ అయిపోయిందని టాక్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా ఫిక్స్ చేసారని తెలుస్తుంది. మహేష్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’లో జతకట్టింది ఈ చిన్నది. ఈ సినిమా భారీ ఫ్లాప్ ను అందుకోవడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న కియారా ఇప్పుడు పవర్ స్టార్ కు జోడిగా నటించనుందట. పవన్, హరీష్ చిత్రం తెరకెక్కబోయే టైమ్‌కి కమిట్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి.. ఈ సినిమా సెట్ లో అడుగు పెట్టాలని ప్లాన్ చేసుకుంటుందట ఈ అమ్మడు.
also read : Sai Pallavi In Pushpa: ‘పుష్ప’లో ‘ఫిదా’ బ్యూటీ.. అల్లు అర్జున్‌తో అలా నటించడానికి ఒప్పుకుంటుందా..?