వరుసగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్.. ఇప్పుడు ఆ హీరో కూడా… ఆసక్తిగా మారిన తమిళనాడు అసంబ్లీ ఎన్నికలు..

|

Dec 14, 2020 | 5:37 PM

త్వరలో తమిళనాడు అసెబ్లీ ఎన్నికలు జరగనున్నవిషయం తెలిసిందే. ఈ తరణంలో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే స్టార్ హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెడుతూ ఆ వేడిని మరింత పెంచుతున్నారు.

వరుసగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న స్టార్స్.. ఇప్పుడు ఆ హీరో కూడా... ఆసక్తిగా మారిన తమిళనాడు అసంబ్లీ ఎన్నికలు..
Follow us on

త్వరలో తమిళనాడు అసెబ్లీ ఎన్నికలు జరగనున్నవిషయం తెలిసిందే. ఈ తరణంలో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే స్టార్ హీరోలు రాజకీయాల్లోకి అడుగు పెడుతూ ఆ వేడిని మరింత పెంచుతున్నారు. కమల్ హాసన్, రజినీకాంత్, విజయ్ ఇలా స్టార్స్ అంతా వరుసగా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో హీరో చేరుతున్నడని  తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది. కమల్ ఇప్పటికే పార్టీ పెట్టి గత ఏడాది లోక్ సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారు.

రజినీకాంత్ ఆధ్యాత్మిక సిద్ధాంతాలతో  పార్టీ పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే తన పొలిటికల్ పార్టీ పేరును రిజిస్టర్ చేసుకున్నారు విజయ్. ఇక హీరో విశాల్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే విశాల్ పొలిటికల్ పార్టీని స్థాపించడం లేదట. ఏదైనా నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్రంగా పోటీచేస్తారని అంటున్నారు. ఇక విశాల్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. నిర్మాతల సంఘం ఎన్నికలు నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీచేసి ఆ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆర్కే నగర్ కు ఉప ఎన్నిక రాగా విశాల్ పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. విశాల్ నామినేషన్ ప్రతిపాదించిన కొంతమందిలో తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో విశాల్ నామినేషన్ తిరస్కరించారు. ఇక ఇప్పుడు విశాల్ పోటీ చేయడం తమిళరాజకీయాల్లో రసకందంగా మారింది. మరి విశాల్ రాజకీయాల్లోనూ రాణిస్తారేమో చూడాలి .