నీటిని వృధా చేయొద్దంటున్న హీరో విజయ్ దేవరకొండ

| Edited By:

Aug 10, 2019 | 8:00 AM

జలమే జీవం.. నీరు లేకుంటే ప్రాణికోటి మనుగడ కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. మనం నీటిని ఎంతగా పొదుపు చేస్తే అది మనకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నీటిని సద్వినియోగపరుచేకోడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. నీటి వృధాను తగ్గించేందుకు ప్రజల్లోఅవగాహనా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌  ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల ప్రచారకర్తగా  హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఈ కార్యక్రమాల కోసం […]

నీటిని వృధా చేయొద్దంటున్న హీరో విజయ్ దేవరకొండ
Follow us on

జలమే జీవం.. నీరు లేకుంటే ప్రాణికోటి మనుగడ కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. మనం నీటిని ఎంతగా పొదుపు చేస్తే అది మనకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా నీటిని సద్వినియోగపరుచేకోడానికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. నీటి వృధాను తగ్గించేందుకు ప్రజల్లోఅవగాహనా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌  ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాల ప్రచారకర్తగా  హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు.

ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఈ కార్యక్రమాల కోసం ప్రచారకర్తగా ఉండేందుకు ఆయన ముందుకు వచ్చినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. ప్రతిరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 కోట్ల లీటర్ల నీరు వృధాగా పోతుందని.. నీటి వినియోగంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తామని చెప్పారు. ఇప్పటికే గత రెండు నెలల్లోనే రికార్డు స్థాయిలో కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్టుగా దానకిషోర్ తెలిపారు. నీటిని సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.