కరోనా కంటే కులపిచ్చి చాలా ప్రమాదకరం: హీరో రామ్

Hero Ram Another Sensational Tweet: రెండు రోజుల క్రితం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ వివాదంపై ట్వీట్స్ చేసిన హీరో రామ్. తాజాగా మరో ట్వీట్ చేశారు. కరోనా కంటే కుల పిచ్చి వైరస్ అత్యంత ప్రమాదకరమని.. అదే వేగంగా వ్యాపిస్తోందని ఆయన అన్నారు. నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఇలాంటి వైరస్‌కు దూరంగా ఉండాలని ట్విట్టర్‌లో తెలిపారు. కులపిచ్చి వైరస్ నుంచి దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని అన్నారు. మంచి కోసం మనం అందరూ కలిసి ఉందామని […]

కరోనా కంటే కులపిచ్చి చాలా ప్రమాదకరం: హీరో రామ్

Updated on: Aug 18, 2020 | 2:07 AM

Hero Ram Another Sensational Tweet: రెండు రోజుల క్రితం విజయవాడ స్వర్ణ ప్యాలెస్ వివాదంపై ట్వీట్స్ చేసిన హీరో రామ్. తాజాగా మరో ట్వీట్ చేశారు. కరోనా కంటే కుల పిచ్చి వైరస్ అత్యంత ప్రమాదకరమని.. అదే వేగంగా వ్యాపిస్తోందని ఆయన అన్నారు. నిశ్శబ్దంగా వ్యాపిస్తున్న ఇలాంటి వైరస్‌కు దూరంగా ఉండాలని ట్విట్టర్‌లో తెలిపారు. కులపిచ్చి వైరస్ నుంచి దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని అన్నారు. మంచి కోసం మనం అందరూ కలిసి ఉందామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల హీరో రామ్ వరుసగా ట్వీట్లతో సంచలనం రేపుతున్నారు. మొన్న స్వర్ణ ప్యాలెస్ ఫైర్ యాక్సిడెంట్ ఘటన గురించి వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ”పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది!! సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి! కొంతమంది ఆయనకు తెలియకుండా చేస్తున్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని.. వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నానంటూ” రామ్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారంటూ.. స్వర్ణ ప్యాలెస్‌ను రమేష్ హాస్పిటల్ కంటే ముందు ప్రభుత్వమే కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిందని పేర్కొన్నాడు. అయితే నిన్న ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ ”చట్టంపై నాకు పూర్తి నమ్మకముంది. అసలైన కుట్రదారులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఇకపై ఈ వివాదానికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయను” అని హీరో రామ్ పేర్కొన్న సంగతి విదితమే.