ఆ పాత రూ.5 నోటు‌కు.. లక్షల్లో జాక్‌పాట్ వస్తుందట!

|

Jan 18, 2020 | 5:53 AM

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొద్దిరోజుల క్రిందట ఆన్లైన్‌లో ఓ ఐదు రూపాయల నోటు వేలానికి వచ్చిందట. ఇక అది కాస్తా ఏకంగా లక్షల్లో అమ్ముడుపోయిందని సమాచారం. అది కేవలం రూ.5 నోటే కదా.. ఎందుకు […]

ఆ పాత రూ.5 నోటు‌కు.. లక్షల్లో జాక్‌పాట్ వస్తుందట!
Follow us on

కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమంది అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కొద్దిరోజుల క్రిందట ఆన్లైన్‌లో ఓ ఐదు రూపాయల నోటు వేలానికి వచ్చిందట. ఇక అది కాస్తా ఏకంగా లక్షల్లో అమ్ముడుపోయిందని సమాచారం. అది కేవలం రూ.5 నోటే కదా.. ఎందుకు లక్షల్లో అమ్ముడుపోయిందని ఆశ్చర్యపోతున్నారా.? అసలు సీక్రెట్ ఏంటంటే.. ఆ నోట్ సిరీస్ చివర్లో 786 అంకెలు ఉండటమే వేలంలో అంత రేట్ పలకడానికి నిదర్శనం. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈబే, ఇండియన్ ఓల్డ్ కాయిన్ తదితర వెబ్‌సైట్స్‌లో పాత నాణేలు, నోట్లపై వేలం జరుగుతూనే ఉంది. అంతేకాకుండా 786 అంకెలు ముస్లింలకు లక్కీ నంబర్స్ అని అంటారు.

అందుకే మీ దగ్గర పాత నాణేలు, నోట్లూ ఉంటే వాటిని ఫోటో తీసి సదరు వెబ్‌సైట్లలో వేలానికి పెట్టండి. నచ్చినవారు తమకు తోచిన మొత్తాన్ని కోట్ చేస్తారు. ఇక ఒకవేళ పోటీదారుల సంఖ్య పెరిగితే మాత్రం మీరు జాక్‌పాట్ కొట్టినట్లే. అవన్నీ కూడా లక్షల్లో అమ్ముడైపోతాయి. ఇలాగే గతంలో 1740కి చెందిన ఒక నాణేం వేలంలో ఏకంగా రూ.3 కోట్లు పలికింది. అంతేకాకుండా శివుడి బొమ్మ ఉన్న 400 ఏళ్ళ నాటి పురాతన వెండి నాణేం రూ.3.50 లక్షలు పలికింది. ఇలా ఇంకా మరెన్నో భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయాయట. ఇక ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. నిజమా లేక ఫేక్ న్యూస్ అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.