Gas and Bloating: గ్యాస్‌ సమస్యకు చిటికెలో చెక్.. ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..

గ్యాస్ తో పాటు కడుపు ఉబ్బరానికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఉత్తమమైన, సులువైన విధానం వాము(అజ్వైన్). ఈ వాము ప్రయోజనాలను మనం చర్చించే ముందు రెండు విషయాలను గమనించాలి. అవేంటంటే..

Gas and Bloating: గ్యాస్‌ సమస్యకు చిటికెలో చెక్.. ఈ చిన్న చిట్కా పాటించండి చాలు..
Gastric Problem (2)

Updated on: Jul 01, 2023 | 4:27 PM

మనలో ప్రతి ఒక్కరి కడుపులోనూ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ప్రతి ఒక్కరూ బయటకు దానిని వదులతారు కూడా. అయితే మితిమీరితేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్బాల్లో అది మనకు పరువు తక్కువగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆ సమస్య గురించి కనీసం స్నేహితులు, వైద్య నిపుణలతో చర్చించడానికి కూడా కొందరు వెనుకాడుతుంటారు. దానితో పాటు పుల్ల తేన్పులు కూడా అజీర్తి సమస్యలుగా చాలా మంది చెబుతుంటారు. వాస్తవానికి కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్ సమస్య ఉత్పన్నమవడం అనేది ప్రతిసారి జీర్ణ వ్యవస్థ సమస్యగా పరిగణించబడదు. అయితే మొదటగా మనం చేయాల్సిందేమిటంటే తీసుకొనే ఆహారంపై శ్రద్ధ పెట్టడం. మన ఆహార అలవాట్లు చాలా వరకూ ఈ గ్యాస్ సమస్యను తగ్గించేస్తాయి. అలాగే కడుపు ఉబ్బరంగా ఉన్న సమయంలో మన పొట్ట సాధారణంగా కంటే కొంచెం గట్టిగా, పెద్దగా అవడం గమనిస్తారు. అయితే దానిలో సైజ్ లో ఎటువంటి మార్పు రాదు కానీ లోపల ఉత్పత్తి అయిన గ్యాసెస్ కారణంగా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. అయితే అసలు ఈ గ్యాస్, కడుపు ఉబ్బరానికి కారణాలు ఏంటి? ఆయుర్వేదంలో దానికి ఉన్న బెస్ట్ చికిత్స ఏమిటి? చూద్దాం..

గ్యాస్, బ్లోటింగ్ కు కారణాలు ఏంటి?

సాధారణంగా గ్యాస్ సమస్య తినేటప్పుడు మాట్లాడటం వల్ల, మంచి మూడ్ లో లేకుండా తినడం, ధూమపానం, పాన్ పరాగ్ నమలడం, వాటర్ బాటిళ్లలో స్ట్రా వాడటం, కడుపులో పరిమితి మించి అధికంగా ఆహారం తీసుకోవడం, అధిక వేడి లేదా ఎక్కువ చల్లగా ఉన్న పానీయాలు తాగడం, చూయింగ్ గమ్ నమలడం, గట్టిగా ఉండే క్యాండీలు నమలడం, శరీరానికి పట్టేసి నట్టు ఉండే దుస్తులు ధరించడం, జలుబు వాడే మందుకు ఎక్కువ కాలం వాడటం వంటి ద్వారా గ్యాస్ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అదే విధంగా సుగర్ ఫ్రీ ఫుడ్స్ తీసుకోవడం, కార్బోనేటెట్ పానీయాలు, అధిక మషాలాలతో కూడిన ఆహారం, ఫ్రై చేసిన ఆహారాలు, డ్రైడ్ ఫ్రూట్స్, యాపిల్, ప్రూన్ జ్యూస్ వంటివి తాగడం వల్ల అజీర్త సమస్య వచ్చి కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆయుర్వేదంలో చికిత్స..

గ్యాస్ తో పాటు కడుపు ఉబ్బరానికి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఉత్తమమైన, సులువైన విధానం వాము(అజ్వైన్). ఈ వాము ప్రయోజనాలను మనం చర్చించే ముందు రెండు విషయాలను గమనించాలి. అవేంటంటే వాములో థైమోల్ ఉంటుంది. అజీర్ణం, తేన్పులు, విరేచనాల వంటి వాటికి ఉపయోగిస్తారు. ఈ థైమోల్ కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్ తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. రెండోది వాములో దీపన్ కూడా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను ప్రేరేపిస్తుంది. జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది. గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వాము నీరు ఎలా తయారు చేయాలంటే..

ఆయుర్వేద నిపుణులు చెబుతున్న దాని ప్రకారం వాము వాటర్ గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలకు చిటికిలో పరిష్కారం చూపుతుంది. దానిని ఎలా తయారు చేయాలో చూద్దాం.. ఓ పాత్రను తీసుకొని దానిలో ఓ గ్లాస్ నీటిని తీసుకోవాలి. దానిని బాగా మరిగించి వాము ఆకులను వేయాలి. రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించి దించేయాలి. నీరు వేడిగా ఉన్నప్పుడే దానిని తాగాలి. నీరు కడుపులోపలికి వెళ్లగానే పని ప్రారంభిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వాము నీరు తాగినా, లేదా వాము గింజలు నమిలినా జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. ఇది ఎసిడిటీని తగ్గించడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..