Corona Hotspots In Hyderabad: హైదరాబాద్‌లో హైరిస్క్ ప్రాంతాలు ఇవే..!

|

Jul 13, 2020 | 12:25 PM

Corona Hotspots In Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 76 శాతం పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 26,574 కరోనా కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 500 పైగా కేసులు నమోదైన 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా […]

Corona Hotspots In Hyderabad: హైదరాబాద్‌లో హైరిస్క్ ప్రాంతాలు ఇవే..!
Follow us on

Corona Hotspots In Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందులో 76 శాతం పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 26,574 కరోనా కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే 500 పైగా కేసులు నమోదైన 8 ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా గుర్తించింది. యూసుఫ్​గూడ, మెహదీపట్నం, కార్వాన్​, అంబర్​పేట్​, రాజేంద్రనగర్​, కుత్బుల్లాపూర్​​, చాంద్రాయణగుట్ట, చార్మినార్​ ఏరియాలు వీటి పరిధిలోకి వచ్చాయి. ఈ ప్రాంతాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

కాగా, హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. 17 రోజులకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెటమాల్, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లు, ఎసిడిటీ తగ్గించే టాబ్లెట్లతో పాటు ఏం చేయాలి.. ఏం చేయకూడదు లాంటి విషయాలపై అవగాహన కల్పించే ఓ పుస్తకం లాంటివి ఉంటాయి.

Also Read:

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం.!

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఏపీ: ఆగష్టు 3 నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. 196 పనిదినాలు..!

ఏపీలో రెడ్ జోన్‌లోకి 97 ప్రాంతాలు.. వివరాలివే.!