భారీ వర్షాలతో మరోసారి ముంబై అతలాకుతలం.. ఆరెంజ్ అలర్ట్ జారీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 04, 2019 | 4:48 PM

దేశ ఆర్ధిక రాజధాని ముంబై వాసులను మరోసారి భారీవర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అడుగుతీసి అడుగు వేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షంతో ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతలో 131.4 మిల్లీమీటర్లు, కొలాబాలో 80 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. నగర పరిధిలో ఉన్న పలు సరస్సులు వరద నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దినసరి కూలీలు, ఉద్యోగస్తులు, స్కూలు విద్యార్ధులు, వాహనదారులు […]

భారీ వర్షాలతో మరోసారి ముంబై అతలాకుతలం.. ఆరెంజ్ అలర్ట్ జారీ
Follow us on

దేశ ఆర్ధిక రాజధాని ముంబై వాసులను మరోసారి భారీవర్షాలు వణికిస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అడుగుతీసి అడుగు వేయాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షంతో ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతలో 131.4 మిల్లీమీటర్లు, కొలాబాలో 80 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. నగర పరిధిలో ఉన్న పలు సరస్సులు వరద నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దినసరి కూలీలు, ఉద్యోగస్తులు, స్కూలు విద్యార్ధులు, వాహనదారులు వ్యాపారులు అంతా వర్షాలతో అల్లాడిపోయారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర వాతారవరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ముంబాయి, థానే ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై తాజా హెచ్చరికలు జారీచేసింది. ముంబైతో పాటు పలు జిల్లాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 13 వందల మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరోవైపు మహారాష్ట్రలోగల రాయగఢ్ వద్ద కుండలిక నదితో పాటు మరో మూడు నదులు ప్రమాదకరస్ధాయిలో ప్రవహిస్తున్నాయి. కుండలిక, అంబా, సావిత్రి నదులు డేంజర్ మార్క్‌ను దాటిపోయాయి. గత కొన్ని రోజుల క్రితం నుంచి రాయగఢ్ ప్రాంతంలో కురిసిన భారీవర్షాలతో అత్యధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ నాలుగు నదుల్లో నీటిమట్టం క్రమేపి పెరుగుతూ ప్రమాదకరస్ధాయికి చేరుకుంది.