అస్సాంలో వరదల బీభత్సం.. 107 మంది మృతి

| Edited By: Pardhasaradhi Peri

Jul 19, 2020 | 8:31 PM

భారీ వర్షాలు, వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. సుమారు 36 లక్షల మంది నిరాశ్రయులు కాగా,, 107 మంది మరణించారు. 290 రిలీఫ్ క్యాంపుల్లో దాదాపు యాభై వేల మందికి ఆశ్రయం కల్పించారు. ప్రధాని మోదీ ఆదివారం రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయపడుతుందన్నారు. కాగా- అనేక  చోట్ల కొండచరియలు విరిగి పడడంతోను, […]

అస్సాంలో వరదల బీభత్సం.. 107 మంది మృతి
Follow us on

భారీ వర్షాలు, వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అనేక గ్రామాలు నీట మునిగాయి. సుమారు 36 లక్షల మంది నిరాశ్రయులు కాగా,, 107 మంది మరణించారు. 290 రిలీఫ్ క్యాంపుల్లో దాదాపు యాభై వేల మందికి ఆశ్రయం కల్పించారు. ప్రధాని మోదీ ఆదివారం రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయపడుతుందన్నారు. కాగా- అనేక  చోట్ల కొండచరియలు విరిగి పడడంతోను, భారీ వృక్షాలు నేల కూలడంతోను ప్రాణ, ఆస్థి నష్టం విపరీతంగా జరిగింది. ముఖ్యమంత్రి సోనోవాల్ పలు గ్రామాలను సందర్శించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.