చైనాలో వరద బీభత్సం.. భారీగా ఇళ్లు నేలమట్టం..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. లోతట్టుప్రాంతాలన్నీ మునిగిపోయాయి.

చైనాలో వరద బీభత్సం.. భారీగా ఇళ్లు నేలమట్టం..

Edited By:

Updated on: Jul 02, 2020 | 11:22 PM

Heavy rainfall: ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టించాయి. లోతట్టుప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రధాన రహదారులు కోతకు గురయ్యాయి. ప్రధానంగా హుబీ ప్రావిన్స్‌లో భారీ నష్టం జరిగింది. 22 నగరాలపై వరదల ప్రభావం చూపింది. లక్షల సంఖ్యలో నిర్వాసితులు నిరశ్రాయులుగా మిగిలిపోయారు. రెస్క్యూటీమ్‌లు సహాయక చర్యలు అందించాయి. వరదల కారణంగా పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. లక్షకు పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..