ఈ నెల 3-5 మధ్య ముంబైలో భారీ వర్షాలు..!

| Edited By:

Aug 01, 2020 | 10:38 PM

ఈ ఏడాది సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య ముంబైలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ

ఈ నెల 3-5 మధ్య ముంబైలో భారీ వర్షాలు..!
Follow us on

ఈ ఏడాది సరైన సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. దేశమంతటా విస్తరించి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య ముంబైలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైతో పాటు రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, పూణె, కొల్హాపూర్, సంగ్లి, బీడ్, లాతూర్, ఒస్మాన్‌బాద్ వంటి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. నాందేడ్, హింగోలి, పర్భాని, జల్నా, సంగ్లి, ఔరంగాబాద్‌లలో ఈ నెల 5వ తేదీ వరకు సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఐఎండీ అంచనాల ప్రకారం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు అంటే 24 గంటల్లో 64.5 మిల్లీ మీటర్ల నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం. ఇక, గత నెల 27-28 మధ్య ముంబై, దాని సబర్బన్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ట్రాఫిక్ స్తంభించి పోయింది.