ఉత్తరాదిలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక..

| Edited By:

Jun 24, 2020 | 10:50 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర భారత దేశంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

ఉత్తరాదిలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక..
Follow us on

Heavy Rain Lashes Delhi: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర భారత దేశంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం పేర్కొంది. ఉత్తర భారత దేశంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అప్పుడప్పుడూ తెరిపి ఇస్తూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ పర్వత ప్రాంతాలు, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లలో రాబోయే 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఉత్తర భారతంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు, కచ్, గుజరాత్, మధ్య ప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలు, చండీగఢ్, ఉత్తర పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర ప్రదేశ్‌లోని అత్యధిక ప్రాంతాలు, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీరు, లడఖ్, గిల్గిట్ బాల్టిస్థాన్, ముజఫరాబాద్‌లకు నైరుతి రుతు పవనాలు బుధవారం చేరుకున్నట్లు పేర్కొంది.